నెలసరి ముందు మహిళలకు మానసిక ఇబ్బందులు.. అందుకు కారణం ఆ సమస్యేనా!?

Published : Feb 22, 2023, 02:47 PM IST
నెలసరి ముందు మహిళలకు మానసిక ఇబ్బందులు.. అందుకు కారణం ఆ సమస్యేనా!?

సారాంశం

సాధారణంగా మహిళలు ఎదుర్కొనే సమస్యలలో నెలసరి సమస్య ఒకటి ప్రతినెల మహిళలు ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు అయితే మహిళలకు నెలసరి వచ్చే కొన్ని రోజుల ముందు పూర్తిగా వారి శరీరంలో మార్పులు చోటు చేసుకుంటాయి.  ఈ మార్పులు కారణంగా పెద్ద ఎత్తున మహిళల వ్యవహార శైలిలో మార్పులు సంభవిస్తాయి. ఇలా నెలసరి ముందు మహిళల ప్రవర్తనలో మార్పు రావడానికి గల కారణం ఏంటి అసలు ఈ పీఎంఎస్ అంటే ఏంటి అనే విషయానికి వస్తే..  

పీఎంఎస్ అంటే ఫ్రీమెన్ స్ట్రువల్ సిండ్రోం అంటారు ఇది మహిళలలో నెలసరి రావడానికి రెండు వారాలు ముందు  ఏర్పడుతుంది. నెలసరి రావడానికి ముందు సంభవించే మానసిక, శారీరక లక్షణాల సముదాయం. ఈ విధంగా
పీఎంఎస్ లక్షణాలు ఎలా ఉంటాయి ఏంటి అనే విషయానికి వస్తే.. ప్రతి చిన్న విషయానికి మహిళలలో చిరాకు కలగడం, విసుకు పుట్టడం, ఇతరులపై కోపం ప్రదర్శించడం, తీసుకొనే ఆహార విషయంలో నియంత్రణ కోల్పోవడం వంటి లక్షణాలు ఉంటాయి.

ఇక నెలసరి రావడానికి రెండు వారాల ముందు నుంచి కూడా కడుపు చాలా ఉబ్బరంగా ఉండడం వక్షోజాల బరువు పెరిగి నొప్పిగా ఉండటం,బాగా డిప్రెషన్ లోకి వెళ్లిపోవడం అనంతరం మనలో ఉన్నటువంటి ఆత్మస్థైర్యాన్ని కోల్పోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఈ పీఎంఎస్ రావడానికి గల కారణం నెలసరికి ముందు మన శరీరంలో విడుదల అయ్యే హార్మోన్ల అసమతుల్యత కారణంగా ఇలాంటి లక్షణాలు ఏర్పడుతుంటాయి.

 నెల నెల సక్రమంగా నెలసరి వచ్చే మహిళలలో నెల మధ్యలోనే అండం విడుదలవుతుంది అదే సమయంలో శరీరంలో అప్పటినుంచి పీరియడ్స్ వచ్చేవరకూ, ప్రోజెస్టిరోన్ అనే హార్మోన్ స్థాయి పెరుగుతుంది. ఇలా ఈ హార్మోన్ స్థాయి పెరగటం వల్ల స్త్రీల మెదుడిపై ఆ ప్రభావం చూపి వారి ప్రవర్తనలలో మార్పును కలిగిస్తుంది.

ఇక ఈ వ్యాధిని ఎలా నిర్ధారించాలి అనే విషయానికి వస్తే దీనికి ఎలాంటి నిర్ధారణ పరీక్షలు లేవు మనం మనలో కలిగే ఈ మార్పులను ఒక డైరీలో రాసి పెట్టుకోవాలి గత నెలలో ఎప్పటినుంచి మన శరీరంలోనూ, మానసికంగా మనలో ఎలాంటి మార్పులు కలిగాయో గుర్తించాలి. అయితే ఈ లక్షణాలు మనలో గుర్తించిన మొదట్లో ఎలాంటి మందులతో కాకుండా శరీర వ్యాయామాలు ఆహారపు నియమాలు జీవన విధానంలో మార్పులు చోటు చేసుకోవడం వల్ల క్రమక్రమంగా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

PREV
click me!

Recommended Stories

Sneeze Reflex: అస‌లు మ‌న‌కు తుమ్ము ఎందుకొస్తుందో తెలుసా.?
ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.. చాలా ప్రమాదం