
ప్రస్తుత కాలంలో కిడ్నీ సమస్యలు సర్వసాధారణం అయిపోయాయి. ఎందుకంటే ఈ రోజుల్లో ఇంటి ఫుడ్ కంటే బయటిఫుడ్ నే ఎక్కువగా తింటున్నారు. ఫాస్ట్ ఫుడ్ ను ఎక్కువగా తినేవారికే మూత్రపిండాల సమస్యలు ఎక్కువగా వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఫాస్ట్ ఫుడ్ ను ఎక్కువగా తినేవారు శారీరక శ్రమను ఎక్కువగా చేయాలి. అప్పుడే పిండి పదార్థాలు సులువుగా జీర్ణం అవుతాయి. అయితే ప్రతిరోజూ ఫాస్ట్ ఫుడ్ ను తీసుకుంటే మీ మూత్రపిండాలు తొందరగా దెబ్బతింటాయి. అందుకే కిడ్నీ సమస్యలున్న వారు బయటిఫుడ్ కంటే ఇంట్లో వండిన ఫుడ్ నే తినాలి. అంతేకాకుండా వీళ్లు కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. లేదంటే కిడ్నీ సమస్యలు ఎక్కువవుతాయి.
కిడ్నీ రోగులు ఎప్పుడూ కూడా ఆరోగ్యకరమైన ఆహారాలనే తినాలి. అప్పుడే వారి శరీరం ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంటుంది. అలాగే వారి శక్తి స్థాయిలు పెరుగుతాయి. కిడ్నీలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. కిడ్నీ పేషెంట్లు భోజనం చేసిన వెంటనే పడుకోకూడదు. మొలకెత్తిన గింజలు, ఇంట్లో తయారుచేసిన జ్యూస్, గ్రీన్ సలాడ్స్ ను ఎక్కువగా తీసుకోవాలి. ఇవి వారి మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇంతకీ కిడ్నీ పేషెంట్లు ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలంటే?