మీ పిల్లలకు పాలలో వీటిని కలిపి అస్సలు ఇవ్వకండి

By Mahesh RajamoniFirst Published Mar 28, 2023, 12:50 PM IST
Highlights

పిల్లలు రోజూ పాలు తాగితే ఎముకలు బలంగా ఉంటాయి. వారి స్టామినా కూడా పెరుగుతుంది.  పాలలో కాల్షియంతో పాటుగా ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. కానీ పాలలో కొన్ని పదార్థాలను కలిపి పిల్లలకు అసలే ఇవ్వకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

పాలు పిల్లలకు ప్రధాన ఆహారం. పాలలో కాల్షియం, ప్రోటీన్, విటమిన్ డి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పిల్లలు పాలను తాగడం వల్ల పిల్లల స్టామినా పెరుగుతుంది. ఎముకలు, దంతాలు బలంగా ఉంటాయి. అయితే పాలతో పిల్లల ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే.. పాలలో కొన్ని ఆహారాల పదార్థాలను అసలే కలిపి ఇవ్వకూడదు. ఆ పాల కాంబినేషన్లేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

పాలు, సిట్రస్ పండ్లు

తల్లిదండ్రులు పిల్లలకు ఇవ్వకూడని పాల కాంబినేషన్ పాలు, సిట్రస్ పండ్లు. నారింజ, నిమ్మకాయలు వంటి సిట్రస్ పండ్లలో ఎక్కువ స్థాయిలో ఆమ్లం ఉంటుంది. వీటిని పాలలో కలిపితో పాలలోని ప్రోటీన్లు పెరుగుతాయి. కానీ ఇవి అంత సులువుగా జీర్ణం కావు. ఇది ఉబ్బరం, గ్యాస్, కడుపు తిమ్మిరి వంటి జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. పిల్లలకు ఒక గ్లాసు నారింజ రసం లేదా ఇతర సిట్రస్ పండ్ల రసాన్ని ప్రత్యామ్నాయంగా ఇవ్వొచ్చు.

పాలు, ఉప్పుగా ఉండే స్నాక్స్

తల్లిదండ్రులు తమ పిల్లలకు పాలతో చిప్స్ వంటి ఉప్పుగా ఉండే స్నాక్స్ ను ఇవ్వకూడదు. ఉప్పు ఎక్కువగా ఉండే స్నాక్స్ నిర్జలీకరణానికి కారణమవుతాయి. ఇది పాలను జీర్ణం చేయడం కష్టతరం చేస్తుంది. ఇది జీర్ణశయాంతర సమస్యలు, శారీరక అసౌకర్యానికి దారితీస్తుంది. బదులుగా తల్లిదండ్రులు తమ పిల్లలకు ఒక గ్లాసు నీరు లేదా పండ్లు లేదా కూరగాయలు వంటి ఆరోగ్యకరమైన చిరుతిండిని పెట్టొచ్చు. 

పాలు, పుచ్చకాయలు

పాలలో ప్రోటీన్, కొవ్వు కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. పుచ్చకాయను పాలలో కలిపి తీసుకోవడం అంత మంచిది కాదు. పుచ్చకాయలో ఉండే ఆమ్లం పాలలోని ప్రోటీన్ ను బంధిస్తుంది. వీటిని తాగితే జీర్ణ అసౌకర్యం, ఇతర సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.

పాలు, ద్రాక్ష

పాలను ద్రాక్షను కలిపి తీసుకోవడం మంచిది కాదు. అలాగే ద్రాక్షను తిన్న తర్వాత .. గంటలోపే పాలను అసలే తాగకూడదు. ద్రాక్షలో ఆమ్ల స్వభావం ఎన్నో సమస్యలను కలిగిస్తుంది. ఈ రెండింటి కలయిక వల్ల జీర్ణశయాంతర అసౌకర్యం, నొప్పి, విరేచనాలు వస్తాయి. 
 

click me!