ఈ రకంగా చూస్తే.. కరోనా వచ్చి మంచే చేసిందా..?

By telugu news teamFirst Published Jul 17, 2020, 10:06 AM IST
Highlights

ఇది మేము చెబుతున్నమాట కాదు. తాజాగా ఓ సంస్థ జరిపిన సర్వేలో ఈ విషయాలు వెలుగుచూశాయి. కరోనా కారణంగా.. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రజలు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. 

కరోనా వైరస్ కారణంగా ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. లక్షల మంది వైరస్ బారిన పడుతున్నారు. వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. అంతటి మహమ్మారి వచ్చినందుకు అందరూ బాధపడిపోతుంటే.. కరోనా వచ్చి మంచి పని చేసింది అంటున్నారు.. అని ఆవేశపడిపోకండి.

నిజమే.. కరోనా వైరస్ ప్రపంచ దేశాలతోపాటు.. మన దేశంలోనూ విలయతాండవం సృష్టిస్తోంది. వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే... ఈ వైరస్ కారణంగా.. మనుషుల్లో ప్రాణ భయం పెరిగిపోయిందన్న విషయం మాత్రం స్పష్టంగా అర్థమౌతోంది.

నిన్న, మొన్నటి వరకు ఫాస్ట్ ఫుడ్స్ వెంట పరుగులు తీసిన జనమంతా... ఇప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ.. ఇంటి ఫుడ్ పై దృష్టిపెడుతున్నారు. అంతేనా... మొన్నటి వరకు కూల్ డ్రింక్స్ తప్ప ముట్టని వారు కూడా.. ఇప్పుడు ఇంట్లో ఫ్రూట్ జ్యూస్ లు, కూరగాయలు, సలాడ్స్ అంటూ తినేస్తున్నారు.

ఇది మేము చెబుతున్నమాట కాదు. తాజాగా ఓ సంస్థ జరిపిన సర్వేలో ఈ విషయాలు వెలుగుచూశాయి. కరోనా కారణంగా.. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రజలు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. 

శరీరంలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉన్నవారిపై వైరస్ ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. వారు వైరస్ బారిన పడినా కూడా  చాలా సులభంగా బయటపడుతున్నారు. దీంతో.. రోగనిరోధక శక్తిని పెంపొందించే ఆహారపదర్ధాలపై జనాలు ఫోకస్ పెట్టారు.

ఇందులో భాగంగా ముఖ్యంగా కోడిగుడ్లు, నిమ్మకాయలు విపరీతంగా కొనుగోలు  చేస్తున్నట్లు తేలింది. రేటు ఎంత పలికినా కూడా.. గుడ్డు కొనడానికి అసలు వెనకాడటం లేదు. అంతేకాదు.. డ్రై ఫ్రూట్స్ వాడకం కూడా విపరీతంగా పెరిగిపోయినట్లు తెలుస్తోంది.

మన తెలుగు రాష్ట్రాల్లోనే బాదం, పిస్తా, వాల్‌నట్స్‌ విక్రయాలు సైతం భారీగానే పెరిగాయని సమాచారం. కరోనాకు ముందు నెలకు సుమారు వంద కిలోల డ్రై ఫ్రూట్స్‌ అమ్మే తాము ప్రస్తుతం 150 కిలోల వరకు విక్రయిస్తున్నట్లు ఓ వ్యాపారి తెలిపారు. 

బాదం, పిస్తా, వాల్‌నట్‌ విక్రయాలు బాగా పెరిగినా ధరలు మాత్రం పెరగలేదని చెబుతున్నారు. బాదం కిలో రూ.1200 నుంచి వెయ్యికి తగ్గిందని తెలిపారు. 

శొంఠి, యాలకులు, లవంగాలకు డిమాండ్‌ విపరీతంగా పెరిగింది. కరోనా వైరస్ అరికట్టేందుకు ఇంట్లో కశాయం చేసుకోని తాగాలని నిపుణులు సూచిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కషాయం తయారీలో లవంగాలు, యాలకలదే ప్రధాన పాత్ర. దీంతో.. వాటి డిమాండ్ కూడా బాగా పెరిగిపోయింది.

click me!