క్యాన్సర్ మహమ్మారికి చెక్... ఫ్యాటీ ఆసిడ్స్ గుర్తింపు

By telugu news teamFirst Published Jul 16, 2020, 2:17 PM IST
Highlights

కొత్త పరిశోధన ద్వారా క్యాన్సర్ సంభావ్య చికిత్సలో  కొన్ని చిక్కులు ఉన్నప్పటికీ, ఒక కీలక అడుగు పడిందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. 

కేన్సర్ మహమ్మారి.. ఇప్పటి వరకు ఎందరో ప్రాణాలను హరించివేసింది. చాలా మంది దీని నుంచి తట్టుకొని నిలబడినా.. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే.. ఈ క్యాన్సర్ విషయంలో శాస్త్రవేత్తలు పురోగతి సాధించారు.

క్యాన్సర్‌ కణాలను  చంపగల   ఫ్యాటీ ఆసిడ్స్‌ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. డిహోమో-గామా-లినోలెనిక్ ఆమ్లం లేదా డీజీఎల్‌ఏ అనే కొవ్వు ఆమ్లం మానవులలో క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుందని తాజా పరిశోధనలో తేలింది. కొత్త పరిశోధన ద్వారా క్యాన్సర్ సంభావ్య చికిత్సలో  కొన్ని చిక్కులు ఉన్నప్పటికీ, ఒక కీలక అడుగు పడిందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. 

ప్రధానంగా డీజీఎల్‌ఏ అనే కొవ్వు ఆమ్లం మానవులలోని క్యాన్సర్ కణాలలో ఫెర్రోప్టోసిస్‌ను ప్రేరేపిస్తుంది. ఫెర్రోప్టోసిస్‌ అంటే దెబ్బతిన్న లేదా పనిచేయని కణాలు సురక్షితంగా, సమర్ధవంతంగా నాశనం చేయడం లేదా రీసైకిల్ చేయడం. ఇనుము ("ఫెర్రో" అంటే ఇనుము) ను ఉపయోగించే అత్యంత నియంత్రిత సెల్ డెత్ ప్రోగ్రామ్‌ను ఫెర్రోప్టోసిస్ అంటారు. దీన్ని 2012లో శాస్త్రవేత్తలు  కనుగొన్నారు. 

పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ (పీయూఎఫ్ఏ), డీజీఎల్‌ఏ ఆమ్లం ఉండే ఆహారం తీసుకోవడం ద్వారా అటు జంతువుల్లో ఇటు మానవులలోని కేన్సర్‌ కణాలలోనూ ఫెర్రోప్టోసిస్‌ను ప్రేరేపిస్తుందని అధ్యయనం తెలిపింది. ఈ డీజీఎల్‌ఏను  ఖచ్చితంగా కేన్సర్‌ కణంలోకి బట్వాడా చేయగలిగితే, అది ఫెర్రోప్టోసిస్‌ను ప్రోత్సహిస్తుందనీ, తద్వారా కణితిలోని కేన్సర్‌‌ కణాలను హరించి వేస్తుందని తెలిపారు.

click me!