Mahashivratri 2023: మహాశివరాత్రి రోజున శివ భక్తులంతా నిష్టగా ఉపవాసం ఉంటారు. దీనివల్ల శివానుగ్రహం పొందుతారని నమ్ముతారు. ఈ సంగతిని పక్కన పెడితే ఉపవాసాల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని సైన్స్ చెబుతోంది. ఎన్నో అధ్యయనాలు కూడా ఉపవాసంతో ఆరోగ్య ప్రయోజనాల గురించి వెల్లడించాయి.
Mahashivratri 2023: మహాశివరాత్రిని ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రోజు శివారాధనతో పాటుగా ఉపవాసం కూడా ఉంటారు. అంతేకాదు రాత్రంతా మేల్కొని జాగారం చేస్తారు. వీటివల్ల మనం చేసిన పాపాలన్నీ తొలగిపోయి.. అంతా మంచే జరుగుతుందని జ్యోతిష్యులు చెబుతారు. ఈ సంగతి పక్కన పెడితే ఉపవాసం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారని సైన్స్ చెబుతోంది. ఈ రోజులో చాలా మంది అడపాదడా ఉపవాసాన్ని కూడా పాటిస్తున్నారు. ఈ అడపాదడపా ఉపవాసంలో ప్రతి రోజూ లేదా వారంలో ఒక నిర్ధిష్ట కాలం పాటు ఆహారాలకు దూరంగా ఉంటారు. దీనిలో ఆరోగ్య ప్రయోజనాలతో పాటుగా కొన్ని దుష్ప్రభవాలు కూడా ఉన్నాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇకపోతే ఉపవాసం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి
undefined
ఉపవాసం మధుమేహులకు ప్రయోజకరంగా ఉంటుందని పలు అధ్యయనాలు కనుగొన్నాయి. అవును డయాబెటీస్ ఉన్నవారు ఉపవాసం ఉంటే ఎంతో మంచి జరుగుతుంది. టైప్ 2 డయాబెటీస్ ఉన్న 10 మందిపై జరిపిన అధ్యయనంలో స్వల్పకాలిక అడపాదపా ఉపవాసం వల్ల వారి రక్తంలో చక్కెర స్థాయిలు బాగా తగ్గాయని వెల్లడైంది. 2014 లో జరిపిన మరొక అధ్యయనంలో ఒక రోజు ఉపవాసం ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడానికి బాగా సహాయమపడుతందనిన తేలింది. ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడం వల్ల గ్లూకోజ్ కణాలకు మరింత సమర్థవంతంగా రవాణా అవుతుంది.
మంటను తగ్గిస్తుంది
దీర్ఘకాలిక మంట క్యాన్సర్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, గుండె జబ్బులతో సహా ఎన్నో ప్రమాదకరమైన రోగాలకు దారితీస్తుంది. కాగా ఉపవాసం సి రియాక్టివ్ ప్రోటీన్ స్థాయిలను బాగా తగ్గిస్తుందని ఓ అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా కేలరీలను తీసుకోవడం తగ్గిస్తే మంట స్థాయిలు బాగా తగ్గాయని అధ్యయనం కనుగొంది. ఆ ఉపవాసం మల్లిపుల్ స్క్లెరోసిస్ చికిత్సలో ప్రయోజనకరంగా ఉంటుందని కనుగొన్నారు.
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
ఉపవాసం ఉండటం వల్ల ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుంది. దీనివల్ల బరువు పెరగడం, డయాబెటీస్ సమస్య ఎక్కువ కావడం వంటివి జరగవు. మీకు తెలుసా ఈ రెండూ గుండె సంబంధ సమస్యలకు దారితీస్తాయి. ఉపవాసంతో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గుతాయి. దీంతో మీ గుండె సురక్షితంగా ఉంటుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే ఉపవాసం రక్తపోటును, మంటను తగ్గిస్తాయి. ఏదేమైనా దీనిపై మరిన్ని పరిశోధనలు అవసరమవుతాయి.
బరువు తగ్గుతుంది
మీరు కేలరీలను తీసుకోవడం తగ్గిస్తే ఆటోమెటిక్ గా మీరు బరువు తగ్గుతారు. ఉపవాసంతో కేలరీలను చాలా వరకు తగ్గిస్తారు. అందుకే ఇది మీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అయినప్పటికీ బరువు తగ్గాలనీ రోజంతా ఉపవాసం అసలే ఉండకూడదు. ఎందుకంటే ఇది మీ బాడీలో చక్కెర స్థాయిలను బాగా తగ్గిస్తుంది. దీంతో మీ ఒంట్లో శక్తి ఉండదు. అందుకే శివరాత్రికి ఉపవాసం చేసేవారు పండ్లు, పాలను తీసుకోవాలంటారు.
ఉబ్బరం తగ్గుతుంది
ఉపవాసం ముఖ్యంగా మహాశివరాత్రి ఉపవాసం ఉండటం వల్ల ఉబ్బరం తగ్గుతుంది. ఎందుకంటే ఉపవాసం సమయంలో ఉప్పు ఉన్న ఆహారాలను తినరు. దీంతో మన శరీరంలో నీరు నిల్వ ఉండటమే కాదు ఉబ్బరం కూడా తగ్గుతుంది. ఉబ్బరం తగ్గితే అజీర్ణం నుంచి ఉపశమనం పొందుతారు. పేగు కదలికలు కూడా మెరుగుపడతాయి.