రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య పడుకోవడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా?

By Mahesh RajamoniFirst Published Mar 21, 2023, 12:20 PM IST
Highlights

రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య పడుకోవడం ఆరోగ్యకరమైన అలవాటు. ఇది మన మొత్తం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ముఖ్యంగా ఇన్ని గంటల మధ్య పడుకుంటే ప్రశాంతంగా నిద్రపడుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే..
 

రాత్రి 8-10 గంటల మధ్య పడుకోవడం మంచి అలవాటని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇలా పడుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతాం. మన శరీరానికి నిద్ర చాలా చాలా అవసరం. సరిగ్గా నిద్రపోకుంటే రోగనిరోధక శక్తి తగ్గడంతో పాటుగా ఎన్నో అనారోగ్య సమస్యలుు వస్తాయి. అసలు రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య పడుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలను పొందుతామో ఇప్పుడు తెలుసుకుందాం..
 
ఆరోగ్యకరమైన నిద్ర

మనం త్వరగా పడుకున్నప్పుడు మన శరీరానికి విశ్రాంతి, పునరుత్తేజం పొందడానికి తగినంత సమయం దొరుకుతుంది. ఇది మన మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. అంతేకాదు అభిజ్ఞా పనితీరు కూడా మెరుగుపడుతుంది. తగినంత నిద్ర పోవడం వల్ల డయాబెటిస్, గుండె జబ్బులు, ఊబకాయం వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుంది. 

హార్మోన్లను నియంత్రిస్తుంది

త్వరగా పడుకోవడం వల్ల కూడా మన శరీరంలోని హార్మోన్లు నియంత్రణలో ఉంటాయి. ముఖ్యంగా ఒత్తిడికి సంబంధించిన కార్డిసాల్ హార్మోన్ నియంత్రణలో ఉంటుంది. మన ఒత్తిడి ప్రతిస్పందనకు కారణమయ్యే కార్టిసాల్ అనే హార్మోన్ సహజంగా రాత్రి తెల్లవారుజామున తక్కువగా ఉంటుంది. త్వరగా పడుకుంటే కార్టిసాల్ స్థాయిలు తగ్గుతాయి. ఇది మన మొత్తం ఆరోగ్యం, శ్రేయస్సుపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.

రోగనిరోధక శక్తి పెరుగుతుంది

ప్రశాంతంగా నిద్రపోవడం వల్ల మన శరీరం ఎక్కువ తెల్ల రక్త కణాలను ఉత్పత్తి చేస్తుంది. ఇవి అంటువ్యాధులు, ఇతర వ్యాధులతో పోరాడుతాయి. కంటినిండా నిద్ర పోవడం వల్ల మన శరీరం అనారోగ్యం నుంచి తొందరగా కోలుకుంటుంది. అంతేకాదు మన శక్తి స్థాయిలు కూడా పెరుగుతాయి. 

ఆకలి నియంత్రణలో ఉంటుంది

త్వరగా పడుకోవడం వల్ల మన ఆకలి నియంత్రణలో ఉంటుంది. ముఖ్యంగా సరైన నిద్ర ఆకలి కోరికలను బాగా తగ్గిస్తుంది. మనకు తగినంత నిద్ర లేకుంటే మన శరీరం ఆకలి హార్మోన్ అయిన గ్రెలిన్, లెప్టిన్ అనే హార్మోన్ ను తక్కువగా ఉత్పత్తి చేస్తుంది. ఇది సంపూర్ణతను సూచిస్తుంది. ఇది అతిగా తినడానికి, బరువు పెరగడానికి దారితీస్తుంది. త్వరగా పడుకోవడం, కంటినిండా నిద్రపోవడం ద్వారా ఈ హార్మోన్లను నియంత్రించొచ్చు. నిద్ర ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహిస్తుంది. 

మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది

కంటినిండా నిద్ర లేకపోతే ఒత్తిడి, నిరాశ, ఆందోళనలు పెరుగుతాయని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. త్వరగా పడుకుంటే ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉండదు. తగినంత నిద్రపోతే మీరు మరింత శక్తివంతంగా ఉంటారు. ఇది మన మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.


 

click me!