ఎండలు పెరుగుతున్నయ్.. వడదెబ్బకొట్టొదంటే ఇలా చేయండి..

Published : Mar 02, 2023, 11:10 AM IST
ఎండలు పెరుగుతున్నయ్.. వడదెబ్బకొట్టొదంటే ఇలా చేయండి..

సారాంశం

ఉందయం 9 గంటల నుంచే ఎండలు మండిపోతున్నయ్.  మండుతున్న ఎండల వల్ల వడదెబ్బకొట్టే ఛాన్స్ ఉంది. ఇలాంటి సమయంలో టీ, కాఫీ, శీతల పానీయాలను తాగకూడదు. అలాగే ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలను కూడా తినకూడదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖా హెచ్చరిస్తోంది. 

భారత వాతావరణ శాఖ 2023లో తొలిసారి వడగాల్పుల హెచ్చరికలను జారీ చేసింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్చి నుంచి మే వరకు వడగాల్పులకు చేయాల్సినవి, చేయకూడని వాటి జాబితాను విడుదల చేసింది.  తగినంత వైద్య, ఆరోగ్య సిబ్బంది ఉండేలా చూడాలని, సౌకర్యాలు సౌలభ్యంగా ఉండేలా చూడాలని, అవసరమైన మందులు, ఇంట్రావీనస్ ఫ్లూయిడ్స్, ఐస్ ప్యాక్లు, ఇతర అవసరమైన పరికరాల లభ్యతను సమీక్షించాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది. ఎండకాలంలో ప్రజలు చేయాల్సినవి, చేయకూడదని పనుల జాబితాను వెల్లడించింది. 

చేయాల్సినవి, చేయకూడనివి

హైడ్రేటెడ్ గా ఉండటానికి నీళ్లను ఎక్కువగా తాగాలి. జర్నీ చేసేటప్పుడు వాటర్ బాటిల్ ను ఖచ్చితంగా తీసుకెళ్లండి. పుచ్చకాయ, దోసకాయ, నిమ్మ, నారింజ వంటి తాజా పండ్లతో పాటు నిమ్మ రసం, మజ్జిగ, లస్సీ, పండ్ల రసాలను తాగండి. అలాగే ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ఓఆర్ఎస్) వంటి పానీయాలను తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ లేఖలో ఉంది. 

పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి రక్షణ పొందేందుకు మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బయటకు వెళ్లకపోవడమే మంచిది. పార్కింగ్ చేసిన కార్లలో పిల్లలను విడిచిపెట్టవద్దని కూడా సిఫార్సు చేసింది. ఎందుకంటే అవి సాధారణం కంటే వేడిగా ఉంటాయి. అంతే కాకుండా ఆల్కహాల్, టీ, కాఫీ, కార్బొనేటేడ్ శీతల పానీయాలకు దూరంగా ఉండాలి.

చేయాల్సినవి

శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవాలి. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే పండ్లను ఎక్కువగా తినండి. కొబ్బరి నీళ్లు, నిమ్మరసం ఎక్కువగా తాగకండి. శరీరంలో నీటి శాతం తగ్గితే ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే మీ శరీరంలో వాటర్ కంటెంట్ తగ్గకుండా చూసుకోండి. బాడీని ఎప్పుడూ హైడ్రేట్ గా ఉండండి.

చేయకూడనివి

ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉండే మాంసాహారానికి దూరంగా ఉండండి. ఉప్పుగా, కారంగా, నూనె ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండండి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు వంట అస్సలు చేయకూడదు. దీనివల్ల మీ ఇల్లు వేడిగా అవుతుంది. సులభంగా జీర్ణమయ్యే భోజనాన్ని తరచుగా, చిన్న భాగాలలో తినండి. వేడి ఎక్కువగా ఉన్నప్పుడు వ్యాయామం చేయడం మానుకోండి. వాతావరణం చల్లగా ఉన్నప్పుడే ఎక్సర్ సైజ్లు చేయండి. మధ్యాహ్నం సూర్యరశ్మికి దూరంగా ఉండండి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Health: చాయ్‌తో వీటిని క‌లిపి తింటున్నారా.? తీవ్ర స‌మ‌స్య‌లు త‌ప్ప‌వు
Mineral Water: మినరల్ వాటర్‌ను వేడిచేసి తాగడం మంచిదా? కాదా? తాగితే ఏమవుతుంది?