
పుచ్చకాయ: వేసవికాలంలో మార్కెట్లో మనకు విరివిగా కనిపించే పండ్లలో పుచ్చకాయ ఒకటి. ఇందులో ఎన్నో రకాల పోషక విలువలు దాగి ఉన్నాయి అలాగే 90% నీటిని కలిగి ఉంటుంది కనుక వేసవిలో ఈ పండు తినడం వల్ల మన శరీరం డిహైడ్రేషన్ కాకుండా ఉంటుంది అలాగే ఈ పండును తొక్కతో సహా తినటం వల్ల ఇందులో ఉన్నటువంటి జింక్, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి6మన శరీరానికి పుష్కలంగా లభించడమే కాకుండా మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి దోహదపడుతుంది.
మామిడిపండు: మామిడి పండ్లను కూడా చాలామంది తొక్క తీసి తింటూ ఉంటారు. అయితే ఇలా తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలను కోల్పోయినట్లే. మామిడిపండు తొక్కలో ఉండే ఫైటోన్యూట్రియెంట్స్ క్యాన్సర్ రిస్క్ ను తగ్గిస్తాయి. దీనిలో ఉండే విటమిన్ ఎ, విటమిన్ సిరోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. అలాగే విటమిన్ సి మన శరీరంపై తగిలినటువంటి గాయాలను తొందరగా నయం చేయడంలో కూడా దోహదపడుతుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ పనితీరును మెరుగుపరచడంలో కూడా దోహదం చేస్తుంది.
చిలగడ దుంప: చిలకడ దుంపను పచ్చిగా అయినా లేదా ఉడకబెట్టి అయినా కూడా తినవచ్చు అయితే దీనిని ఎలా తిన్నా కూడా చాలామంది పైన ఉన్న తొక్క తీసి తింటారు. అయితే ఇలా తొక్క తీసి తినడం వల్ల అందులో ఉన్నటువంటి పోషకాలను మనం కోల్పోయినట్టే అవుతుంది. ఈ తొక్కలో ఉండే విటమిన్ ఎ, యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలోనూ అలాగే కంటి చూపులు మెరుగుపరచడంలో దోహదపడతాయి. ఇందులో ఉన్నటువంటి ఐరన్ పొటాషియం ఫైబర్ మన శరీరంలో జీవక్రియలు సక్రమంగా జరగడానికి దోహదం చేస్తుంది. వీటితోపాటు నిమ్మకాయ, ఆరెంజ్, కివి, కీరదోస, బంగాళదుంపలు, వంటి పనులను తొక్కతో సహా తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.