మీరు తాగే కాఫీ మరింత హెల్తీగా ఉండాలా? అయితే ఈ పద్దతులను ట్రై చేయండి..

Published : Feb 25, 2023, 09:44 AM IST
మీరు తాగే కాఫీ మరింత హెల్తీగా ఉండాలా? అయితే ఈ పద్దతులను ట్రై చేయండి..

సారాంశం

కాఫీని మితంగా తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచి జరుగుతుంది. దీనిలో కూడా పోషకాలు ఉంటాయి. అయితే కొన్ని పద్దతులతో ఈ కాఫీని మరింత రుచిగా, ఆరోగ్యంగా మార్చుకోవచ్చు.   

ప్రపంచ వ్యాప్తంగా కాఫీకి మంచి క్రేజ్ ఉంది. మిలియన్ల మంది కప్పు కాఫీతో రోజును ప్రారంభిస్తారు. రోజుకు ఐదారు సార్లు కూడా కాఫీని తాగేవారున్నారు. కాఫీని తాగితే తక్షణ శక్తి అందుతుంది. కాఫీలో కూడా పోషక పదార్థాలు ఉంటాయి. దీన్ని తాగితే ఒత్తిడి తగ్గడంతో పాటుగా ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. అయితే దీనిని లిమిట్ కి మించి తాగినా.. లేదా అదనపు చక్కెరలు వేసినా, కృత్రిమ రుచులతో దీన్ని తాగినా ఆరోగ్యం పాడవుతుంది. అయితే కొన్ని పద్దతులతో కాఫీని మరింత రుచిగా మార్చొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకందాం.. 

కృత్రిమ స్వీటెనర్లకు దూరంగా ఉండండి

హెల్తీ కాఫీ కోసం మీరు మీ కాఫీకి చక్కెర లేదా కృత్రిమ స్వీటెనర్లను జోడించకండి. వీటికి బదులుగా తేనె, మాపుల్ సిరప్ లేదా స్టెవియా వంటి సహజ స్వీటెనర్లను ప్రయత్నించండి. అవి చక్కెర, కృత్రిమ సంకలనాల హానికరమైన ప్రభావాలు లేకుండా మీ కాఫీని తియ్యగా చేస్తాయి. 

గింజ పాలు లేదా కొబ్బరి పాలను వాడండి

ఆవు పాలలో సంతృప్త కొవ్వు, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. ఇది గుండె జబ్బులకు దారితీస్తుంది. అందుకే వీటికి బదులుగా కొవ్వు, కేలరీలు తక్కువగా ఉండే బాదం పాలు, సోయా పాలు లేదా కొబ్బరి పాలను ఉపయోగించండి. 

దాల్చినచెక్క 

దాల్చినచెక్క ఒక సహజ మసాలా దినుసు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. శరీర మంటను తగ్గిస్తుంది. మెదడు పనితీరును మెరుగుపరచడానికి  సహాయపడుతుంది. మీ కాఫీ మరింత రుచిగా, ఆరోగ్యంగా మారేందుకు మీ కాఫీకి కొంత దాల్చిన చెక్కను జోడించండి. 

 పరిమితంగా తాగండి

కాఫీని మితంగా తాగితే  ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. వీటిని మోతాదుకు మించి తాగితే మాత్రం ఆందోళన, నిద్రలేమి, జీర్ణ సమస్యలు వంటి సమస్యలు వస్తాయి. ఆరోగ్యంగా ఉండేందకు రోజుకు 3 నుంచి 4 కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగకూడదు.

బ్లాక్ కాఫీ తాగండి

పాలు, పంచదారతో కాఫీ టేస్టీగా ఉన్నప్పటికీ.. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో హానిచేస్తాయి. ఎందుకంటే దీనిలో అనవసరమైన కేలరీలు, కొవ్వులు ఉంటాయి. అందుకే బ్లాక్ కాఫీని తాగండి. ఎందుకంటే దీనిలో  అదనపు చక్కెరలు లేదా కొవ్వులు ఉండవు. 

కొల్లాజెన్ పౌడర్ 

కొల్లాజెన్ పౌడర్ చర్మ ఆరోగ్యం, గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇది మన మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.  అయితే అదనపు ఆరోగ్య ప్రయోజనాల కోసం మీ కాఫీకి కొల్లాజెన్ పౌడర్ ను కలపండి.

బాదం పాలు, సోయా పాలు, కొబ్బరి పాలు వంటి మొక్కల ఆధారిత పాలు.. ఆవు పాలకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు. వీటిలో కేలరీలు, కొవ్వు తక్కువగా ఉంటాయి. వీటిలో కొలెస్ట్రాల్ కూడా ఉండదు.కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మంటను తగ్గిస్తాయి. మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. ఇది టైప్ 2 డయాబెటిస్, కాలేయ వ్యాధి వంటి అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఎముకలు బలంగా ఉండాలంటే వీటి జోలికి వెళ్లకపోవడమే మంచిది!
రాత్రి భోజనం చేశాక ఈ 5 పనులు అస్సలు చేయొద్దు!