
రోజుకో కొత్త హెడ్ ఫోన్స్, ఇయర్ బడ్స్, ఇయర్స్ ఫోన్స్ మొదలైనవి మార్కెట్ లో లాంచ్ అవుతూనే ఉన్నాయి. కొత్త టెక్నాలజీతో చెవులపై వాటి ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ హెడ్ ఫోన్లు కూడా చెవులకు హాని చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటి వాడకం వల్ల వినికిడి లోపం వస్తుందని హెచ్చరిస్తున్నారు. హెడ్ ఫోన్ల నుంచి వచ్చే పెద్ద పెద్ద శబ్దాల వల్ల వినికిడి గ్రాహకాలుగా ఉన్న చెవిలోపలి చిన్న కణాలు దెబ్బతింటాయి. వీటికి రెస్ట్ ఇస్తే కోలుకుంటాయి. కానీ రోజుల తరబడి ఎక్కువ సేపు హెడ్ ఫోన్స్ ను యూజ్ చేస్తే ఇవి మొత్తమే దెబ్బతిని చెవుడు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సాధారణంగా హెడ్ ఫోన్స్ సౌండ్ తక్కువగా ఉంచడం వల్ల చెవులకు ఎలాంటి హాని జరగదని చాలా మంది చెబుతుంటారు. కానీ దీనిలో ఏమాత్రం నిజం లేదంటున్నారు నిపుణులు. తక్కువ వాల్యూమ్ లో ఉపయోగించినా.. కాలక్రమేణా వినికిడి సామర్థ్యంపై ప్రభావం చూపుతుందట. ఎందుకంటే చెవులకు జరిగే నష్టం ఎంత సౌండ్ వస్తుందనేదే కాదు.. ఎంతసేపు వింటున్నాం అనే దానిపై కూడా ఆధారపడి ఉంటుందట. బహిరంగ ప్రదేశంలో ఎక్కువసేపు కచేరీలకు హాజరు కావడం, చెవి దగ్గర పేలుడు, ఇతర సౌండ్లను వింటే కూడా వినికిడి లోపం వస్తుందట.
హెడ్ ఫోన్లు, ఇయర్ బడ్స్ వంటి ఆడియో పరికరాలను ఎక్కువ సేపు ఉపయోగించడం వల్ల 1 మిలియన్ కంటే ఎక్కువ మంది యువత వినికిడి కోల్పోయే ప్రమాదం ఉందని ఎన్నో అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కోల్పోయిన వినికిడిని తిరిగి పొందడం చాలా కష్టం. అందుకే ముందే జాగ్రత్తగా ఉండటం మంచిది.
హెడ్ ఫోన్స్ ను ఎక్కువ సేపు పెట్టుకోవడం ఈ లక్షణాలు కనిపిస్తాయి..
గంట మోగిన శబ్ధం, గర్జించడం, గుసగుసలాడటం వంటివి శబ్దాలు చెవిలో ప్రతిధ్వనిస్తాయి.
శబ్దం చేసే ప్రదేశాల్లో స్పష్టంగా వినబడదు.
సౌండ్స్ వినపడవు. చెవులు మూసుకున్నట్టుగా అనిపిస్తుంది.
మునుపటి కంటే ఎక్కువ వాల్యూమ్ తో టీవీ చూడటం
మీ చెవులను రక్షించే చిట్కాలు
60%/60-నిమిషాల కాన్సెప్ట్ ని అనుసరించండి
వినికిడి నష్టాన్ని సరిచేయడానికి వినికిడి పరీక్షలు, వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ఇయర్ ఫోన్స్, ఇయర్ బర్డ్స్ వాడకాన్ని పరిమితం చేయాలి. ఇలా చేస్తే డ్యామేజ్ ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. వైద్యులు 60%/60 నిమిషాల భావనను అవలంబించాలని సిఫార్సు చేస్తున్నారు. అంటే 60% కంటే ఎక్కువ వాల్యూమ్ లో పాటలు వినడం, ఆటలు, సినిమాలు చూడొద్దు. అలాగే 60 నిమిషాల కంటే ఎక్కువ సమయం మీ చెవుల్లో ఇయర్ బడ్స్ ను ఉంచకూడదు. ఈ నియమాన్ని పాటించకపోతే మీకు చెవుడు రావడం ఖాయమంటున్నారు నిపుణులు.
ఇయర్ బడ్స్ కు బదులు హెడ్ ఫోన్లకు ప్రాధాన్యతనివ్వండి
ఇయర్ బడ్స్ కు బదులుగా హెడ్ ఫోన్స్, ఇయర్ ఫోన్స్ వంటి డివైజ్ లు వాడాలని డాక్టర్లు సూచిస్తున్నారు. అందుకే హెడ్ ఫోన్స్ నే వాడండి. ఎందుకంటే ఇది ఇయర్ బర్డ్స్, ఇయర్ ఫోన్స్ కంటే తక్కువ హానికరం.