దగ్గు ఎంతకీ తగ్గడం లేదా.. దీనికి కారణాలు ఇవే..!

Published : Mar 07, 2023, 11:56 AM IST
 దగ్గు ఎంతకీ తగ్గడం లేదా.. దీనికి కారణాలు ఇవే..!

సారాంశం

మామూలుగా అయితే వారం లేదా రెండు వారాల లోపే దగ్గు తగ్గిపోవాలి. కానీ కొంతమందికి వారాలకు వారాలు దగ్గు అలాగే ఉంటుంది. అయితే ఇలా దగ్గు తగ్గకపోవడానికి కారణాలు చాలానే ఉన్నాయి. అవేంటంటే..

చాలా మందికి జలుబుతో పాటుగా దగ్గు కూడా వస్తుంది. అయితే ఈ దగ్గు సాధారణంగా 3 వారాలలోపే పూర్తిగా తగ్గిపోతుంది. అయితే కొంతమందికి మాత్రం ఎన్ని ఐదారు వారాలైనా కూడా దగ్గు అలాగే ఉంటుంది. ఇలా కావడానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఎనిమిది లేదా అంతకంటే ఎక్కువ వారాలు దగ్గు వస్తే దాన్ని దీర్ఘకాలిక దగ్గు అంటారు. పిల్లలకు నాలుగు వారాల పాటు ఉంటే కూడా దీర్ఘకాలిక దగ్గుగా పరిగణిస్తారు. 

తేనెతో టీ తాగడం లేదా ఓవర్ ది కౌంటర్ మందులు దగ్గును తగ్గించడానికి సహాయపడతాయి. అయితే మీకు దీర్ఘకాలిక దగ్గు రావడానికి ఎన్నో కారణాలున్నాయి. సకాలంలో దగ్గు తగ్గకపోతే వెంటనే హాస్పటల్ కు వెళ్లాలని నిపుణులు చెబుతున్నారు. అసలు దీర్ఘకాలిక దగ్గుకు కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

అంటువ్యాధులు

జలుబు లేదా ఫ్లూ లు పూర్తిగా తగ్గిపోయిన తర్వాత కూడా దగ్గు అలాగే రావొచ్చు. దీనికి కొంచెం సమయం పడుతుంది. దగ్గు అనేది మీ ఊపిరితిత్తులను క్లియర్ చేయడానికి మీ శరీరం ఉపయోగించే ఒక మార్గం. కోవిడ్ 19 ఇన్ఫెక్షన్ ఊపిరితిత్తుల వాపు, పొడి దగ్గుకు కూడా దారితీస్తుంది. ఒకవేళ మీకు దగ్గు ఎన్నిరోజులైనా తగ్గకపోతే వెంటనే  హాస్పటల్ కు వెళ్లండి. 

ధూమపానం

పొగాకులో ఉండే రసాయనాలు, కణాలు మీ గొంతును చికాకు పెడతాయి. ఫలితంగా దీర్ఘకాలిక దగ్గు వస్తుంది. ఇది ఉబ్బసం, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు వంటి దగ్గకు కారణమయ్యే ఇతర సమస్యల లక్షణాలను ఎక్కువ చేస్తుంది. పొగాకు దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందికి దారితీస్తుంది.

న్యూమోనియా

న్యూమోనియా అనేది వైరస్లు, శిలింధ్రాలు లేదా బ్యాక్టీరియా వల్ల కలిగే ఊపిరితిత్తుల సంక్రమణ. ఇది పొడిదగ్గుకు దారితీస్తుంది. అంతేకాదు ఆకుపచ్చ, పసుపు పచ్చ లేదా నెత్తిటితో శ్లేష్మానికి దారితీస్తుంది. న్యూమోనియా లక్షణాలు దగ్గు ఒక్కటే కాదు జ్వరం, చెమట, శ్వాస ఆడకపోవడం కూడా ఉన్నాయి. 

క్షయ

క్షయ తీవ్రమైన అంటువ్యాధి. ఇది ఊపిరితిత్తులను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. మీకు మూడు లేదా అంతకంటే ఎక్కువ వారాల పాటు దగ్గు ఉంటే క్షయ వ్యాధి సంకేతంగా భావించండి. దగ్గులో రక్తంతో కూడిన శ్లేష్మం టీబీ వల్ల కూడా వస్తుంది. అయితే దీనిలో పొడిదగ్గు కూడా రావొచ్చు. ఛాతిలో నొప్పి, అలసట, ఉన్నట్టుండి బరువు తగ్గడం, జ్వరం, రాత్రిపూట చెమటలు పట్టడం, చలి, ఆకలి లేకపోవడం క్షయ వ్యాధి ఇతర లక్షణాలు. ఈ క్షయ వ్యాధి ఊపిరితిత్తులతో పాటుగా మూత్రపిండాలు, వెన్నెముక లేదా మెదడు వంటి శరీరంలోని ఇతర భాగాలను కూడా ప్రభావితం చేస్తుంది. 

ఊపిరితిత్తుల క్యాన్సర్

ఊపిరితిత్తుల క్యాన్సర్ వల్ల కూడా విపరీతమైన దగ్గు వస్తుంది. ఈ దగ్గు ఎంతకీ తగ్గదు. రోజు రోజుకు ఎక్కువ అవుతుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్ వల్ల దగ్గుతో పాటుగా ఛాతీ నొప్పి, శ్వాస ఆడకపోవడం లేదా ఉన్నట్టుండి బరువు తగ్గినట్టుగా అనిపించొచ్చు. అయితే కొంతమందికి ఈ క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్ లో ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. ఏదేమైనా దీనికి కారణాలేంటో హాస్పటల్ కు వెళ్లి తెలుసుకోవడం మంచిది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Health Tips: ఒంటరిగా ఉండటం ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? నిపుణుల మాట ఇదే!
కడుపుబ్బరంతో నరకం చూస్తున్నారా? ఇలా చేస్తే వెంట‌నే రిజ‌ల్ట్