జ్వరం వచ్చిందా.. త్వరగా తగ్గాలంటే ఇలా చేయండి

Published : Mar 07, 2023, 07:15 AM IST
జ్వరం వచ్చిందా.. త్వరగా తగ్గాలంటే ఇలా చేయండి

సారాంశం

శరీర ఉష్ణోగ్రత పెరగడం వల్ల కండరాల నొప్పులు, ఉన్నట్టుండి శరీరం చల్లగా అనిపించడం వంటి సమస్యలు వస్తాయి. అయితే కొన్ని ఇంటి చిట్కాలతో  జ్వరంతో పాటుగా వచ్చే అసౌకర్యం, శరీర మంటను, శరీర ఉష్ణోగ్రతను తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.   

ఏదైనా బ్యాక్టీరియా, వైరల్ లేదా పరాన్నజీవి వల్ల జ్వరం వస్తుంది.  వాస్కులైటిస్ తో పాటుగా అంటువ్యాధులు కూడా జ్వరానికి కారణమవుతాయి. శరీర ఉష్ణోగ్రత సాధారణ పరిధి 37.5, 38.3 సెల్సియస్ (99.5, 100.9 ° ఫారెన్ హీట్) కంటే ఎక్కువగా ఉంటే జ్వరంగా భావిస్తారు. శరీర ఉష్ణోగ్రత పెరగడం వల్ల కండరాల నొప్పి, చలిపెట్టడం వంటి సమస్యలు వస్తాయి. అయితే జ్వరంతో పాటు వచ్చే అసౌకర్యం, మంటను  తగ్గించడానికి కొన్ని ఇంటి చిట్కాలు ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. అయితే మూడు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు లేదా కొన్ని వైద్య సమస్యలతో బాధపడుతున్నవారు  ఈ చిట్కాలను పాటించే ముందు డాక్టర్ ను సంప్రదించాలి.  పారాసిటమాల్, ఇబుప్రోఫెన్ మందులతో జ్వరాన్ని తగ్గించుకోవచ్చు. అయినప్పటికీ జ్వరాన్ని ఇంట్లో వివిధ రకాల సులభమైన పద్ధతులతో తగ్గించుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. 

తులసి

తులసి మొక్క ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి. దీనిలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు శరీర ఉష్ణోగ్రతను సమర్థవంతంగా తగ్గిస్తుంది. జ్వరం తగ్గాలంటే తులసి టీ తయారు చేసుకుని రోజూ రెండు మూడు సార్లు తాగాలి.

వెల్లుల్లి

వెల్లుల్లిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. దీనిలోని యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలు జ్వరం సమయంలో శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి సహాయపడతాయి. అంతేకాదు ఇది చెమట ఎక్కువ పట్టేలా చేస్తుంది. అలాగే శరీరం నుంచి విషాన్ని బయటకు పంపుతుంది. 

ఆపిల్ సైడర్ వెనిగర్

జ్వరానికి మరొక అద్భుతమైన సహజ చికిత్స ఆపిల్ సైడర్ వెనిగర్. అవును ఆపిల్ సైడర్ వెనిగర్ బరువును తగ్గించడానికి కాదు జ్వరాన్ని కూడా తగ్గిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

అల్లం

అల్లం అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న అద్భుతమైన మసాలా దినుసు. దీనిలో యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జ్వరానికి తొందరగా తగ్గిస్తుంది. 

గంధం పేస్ట్

గంధం ఓదార్పు, వైద్యం లక్షణాలకు ప్రసిద్ది చెందింది. ఇది శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంతో పాటు, మంటను తగ్గిస్తుంది. దీనిని ఉపయోగించి కూడా జ్వరం నుంచి తొందరగా బయటపడొచ్చు. 

PREV
click me!

Recommended Stories

Health Tips: ఒంటరిగా ఉండటం ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? నిపుణుల మాట ఇదే!
కడుపుబ్బరంతో నరకం చూస్తున్నారా? ఇలా చేస్తే వెంట‌నే రిజ‌ల్ట్