ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలను ఇందుకే ఎక్కువగా తినాలంటరు..

Published : Feb 25, 2023, 02:24 PM IST
ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలను  ఇందుకే ఎక్కువగా తినాలంటరు..

సారాంశం

ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉండే ఆహారాలను ఎక్కువగా తినాలని ఆరోగ్య నిపుణులు, డాక్టర్లు చెప్తుంటారు. ఎందుకో తెలుసా? ఇవి ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెడతాయి కాబట్టి.   

ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు గుండెను ఆరోగ్యంగా ఉంచే ఆరోగ్యకరమైన కొవ్వులను కలిగి ఉంటాయి. అంతేకాదు ఈ కొవ్వులు చర్మాన్ని ఆరోగ్యం, కాంతివంతంగా ఉంచుతాయి. మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అందుకే ఒమేగా-3 కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాలను లేదా సప్లిమెంట్స్ ను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు, డాక్టర్లు ఎప్పుడూ చెప్తుంటారు. 

ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. ముఖ్యంగా ఇవి మెదడు, గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి, మంటను తగ్గించడానికి, ఎన్నో దీర్ఘాకలిక అనారోగ్య సమస్యల నుంచి మనం బయటపడేందుకు కూడా సహాయపడతాయి. ఒమేగా -3 సప్లిమెంట్స్ నిరాశ, ఆందోళనను తగ్గిస్తాయని ఎన్నో అధ్యయనాలు కనుగొన్నాయి. 

ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు మూడు రకాలుగా ఉంటాయి. అందులో ఒకటి ఆల్ఫా-లినోలెనిక్ ఆమ్లం (ఎఎల్ఎ). రెండోది ఎకోసాపెంటనోయిక్ ఆమ్లం (ఇపిఎ). మూడోది డోకోసాహెక్సానోయిక్ ఆమ్లం (డిహెచ్ఎ). పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. నిరాశ లక్షణాలను తగ్గించడండానికి  ఇపిఎ అంటే ఎకోసాపెంటయనోయిక్ ఆమ్లం అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. 

డిహెచ్ఎ అని పిలువబడే ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు కంటి రెటీనా భాగాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. దృష్టి లోపం, అంధత్వానికి కారణమయ్యే మాక్యులర్ క్షీణతను నివారించడానికి ఈ కొవ్వులు ఆమ్లాలు బాగా సహాయపడతాయి. శిశువుల మెదడు పెరుగుదల, అభివృద్ధికి ఒమేగా -3 కీలక పాత్ర పోషిస్తుంది. గర్భధారణ సమయంలో తగినంత ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్ లను తీసుకుంటే శిశువు పెరుగుదల బాగుంటుంది. మెరుగైన అభిజ్ఞా అభివృద్ధికి ఒమేగా -3 ఎంతో సహాయపడుతుంది.

అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్ (ఎడిహెచ్డి) అనేది ప్రవర్తనా రుగ్మ. ఇది అశ్రద్ధ, హైపర్ యాక్టివిటీ వంటి సమస్యలకు దారితీస్తుంది.  ఎడిహెచ్ డీ ఉన్న పిల్లలలో ఎడిహెచ్ డీ లేనివారి కంటే ఒమేగా -3 కొవ్వు ఆమ్లాల రక్త స్థాయిలు తక్కువగా ఉన్నాయని కొన్ని పరిశోధనలు కనుగొన్నాయి. ఒమేగా -3 సప్లిమెంట్స్ ఎడిహెచ్ డీ లక్షణాలను తగ్గించడానికి సహాయపడతాయని ఎన్నో అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 

ఒమేగా -1 కొవ్వు ఆమ్లాలు టైప్ 3 డయాబెటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, పెద్దప్రేగు పూత, సోరియాసిస్ తో సహా అనేక స్వయం ప్రతిరక్షక వ్యాధులకు చికిత్స చేయడానికి, వాటిని నివారించడానికి సహాయపడతాయి. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు వయస్సు-సంబంధిత మానసిక క్షీణత, అల్జీమర్స్ వ్యాధిని నివారించడానికి కూడా సహాయపడతాయి.

ఒమేగా-3 లోపం లక్షణాలు

  • చర్మం, జుట్టు, గోళ్లలో మార్పులు
  • హృదయ సంబంధ సమస్యలు
  • ఏకాగ్రత లోపం సమస్యలు
  • కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులు
  • అలసట, నిద్ర సమస్యలు

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sneeze Reflex: అస‌లు మ‌న‌కు తుమ్ము ఎందుకొస్తుందో తెలుసా.?
ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.. చాలా ప్రమాదం