మునగాకులు తింటే ఈ రోగాలన్నీ దూరం..!

By Mahesh RajamoniFirst Published Mar 28, 2023, 1:39 PM IST
Highlights

మునగాకులను తింటే శరీరంలో చెడు కొలస్ట్రాల్ స్థాయిలు తగ్గిపోతాయి. గుండె జబ్బులొచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఈ ఆకులను తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. అలాగే..
 

మునగాకులు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఎందుకంటే ఇది ఎన్నో రోగాలను తగ్గిస్తుంది. మునగాకులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే విటమిన్లు, కాల్షియం, ఐరన్, అమైనో ఆమ్లాలు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. 

మునగాకు ఔషదాల నిధి. దీనిలో యాంటీ ఫంగల్, యాంటీవైరల్, యాంటి డిప్రెసెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. మునగాకునను తింటే మన శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. అలసట , ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

మునగాకులు  చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి. దీంతో గుండె జబ్బుల ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. మునగాకు జింక్ కు అద్భుతమైన మూలం. మునగాకు బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది. అంతేకాదు ఇది డయాబెటిస్ ను నియంత్రించడానికి లేదా నివారించడానికి కూడా సహాయపడుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మునగాకులు ప్రోటీన్, ముఖ్యమైన అమైనో ఆమ్లాలు, 27 విటమిన్లు, 46 యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. 

మునగాకులో క్వెర్సెటిన్, క్లోరోజెనిక్ ఆమ్లం వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. మునగాకులు రక్తంలో యాంటీ ఆక్సిడెంట్ల స్థాయిని పెంచుతాయి. మునగాకుల్లో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, క్రిమినాశక లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. మునగాకు కూడా చర్మ సంరక్షణకు ఉపయోగపడుతుంది.

మునగాకుల్లో ఫైటో న్యూట్రియెంట్స్ కూడా ఉంటాయి. ఇవి మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఈ ఆకులు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. దీంతో మన శరీరం ఎన్నో అంటువ్యాధులతో పోరాడుతుంది. ఎన్నో రోగాలకు దూరంగా ఉంచుతుంది. 

మునగాకులు తినడం వల్ల జీర్ణ సమస్యలు కూడా తగ్గిపోతాయి. పెద్దప్రేగు పూతల, గ్యాస్ట్రైటిస్, విరేచనాలు, మలబద్ధకం సమస్యతో బాధపడేవారికి మునగాకులు మంచి మేలు చేస్తాయి. మునగాకుల్లో బలమైన శోథ నిరోధక లక్షణాలు ఉంటాయి. ఇది మంటను నివారించడానికి సహాయపడుతుంది. ఇది తాపజనక ఎంజైమ్లను అణచివేస్తుంది. శోథ నిరోధక సైటోకిన్ల ఉత్పత్తిని పెంచుతుంది. ఇది మన శరీరంలో మంటను తగ్గించడానికి సహాయపడుతుంది.

click me!