ఆడవాళ్లు కొబ్బరి నీళ్లను తాగితే ఏమౌతుందో తెలుసా?

Published : Feb 21, 2023, 01:48 PM IST
ఆడవాళ్లు కొబ్బరి నీళ్లను తాగితే ఏమౌతుందో తెలుసా?

సారాంశం

కొబ్బరి నీళ్లను చిన్నల పెద్దల వరకు ప్రతి ఒక్కరూ తాగాలని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. కొబ్బరి నీళ్లను తాగడం వల్ల శరీరంలో మంట తగ్గుతుంది. బాడీ కూల్ గా ఉంటుంది. అంతేకాదు మన శరీరంలో ఎన్నో అంటువ్యాధులకు దూరంగా ఉంటుంది. అలాగే..  

కొబ్బరి నీళ్లను తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ప్రతి ఒక్కరికీ తెలుసు. అయితే ఈ హెల్తీ డ్రింక్ మహిళల రుతుచక్రానికి ఎంతో మేలు చేస్తుందన్న సంగతి మాత్రం చాలా మందికి తెలియదు. నిజానికి కొబ్బరి నీటిలో శరీరాన్ని శుద్ధి చేసే గుణాలు ఉంటాయి. ఈ వాటర్ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీర మంటను తగ్గిస్తుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు మనల్ని ఎన్నో అంటువ్యాధుల నుంచి రక్షిస్తాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొబ్బరి నీళ్లను పీరియడ్స్ సమయంలో తాగితే కడుపు నొప్పి, తిమ్మిరి వంటి సమస్యలు తగ్గిపోతాయి. 

ఈ ప్రయోజనాలతో పాటుగా కొబ్బరి నీటిని తాగితే మూత్రపిండాల్లో రాళ్లు కరిగిపోతాయి. మన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చర్మం తేమగా, ప్రకాశవంతంగా ఉంటుంది. ఈ వాటర్ ను జుట్టును కూడా తేమగా, బలంగా చేస్తుంది. కొబ్బరి నీళ్లను తాగితే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. క్రమం తప్పకుండా ఈ నీటిని తాగితే చర్మం వృద్ధాప్య ప్రక్రియ నిమ్మదిస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

ముఖం పై మచ్చలు, ముడతలు అందాన్ని తగ్గిస్తాయి. అయితే ఈ సమస్యలను తగ్గించడానికి కొబ్బరి నీళ్లు ఎఫెక్టీవ్ గా పని చేస్తాయి. వయసు మీద పడుతున్న కొద్దీ వచ్చే మచ్చలు వంటి చర్మ సమస్యల నుంచి కూడా కొబ్బరినీళ్లు రక్షిస్తాయి. కొబ్బరి నీరు బరువు తగ్గడానికి, బరువు కంట్రోల్ లో ఉండటానికి బాగా సహాయపడుతుంది.

కొబ్బరి నీరు నెలసరి నొప్పిని తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. కొబ్బరి నీళ్లలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. కొబ్బరి నీటిని తాగితే పీరియడ్స్ లేట్ అయ్యే అవకాశమే ఉండదని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు కొబ్బరి నీరు రుతుస్రావం రక్తం గడ్డకట్టకుండా చేయడానికి ఎంతో సహాయపడుతుంది. 

ఈ వాటర్ లో ఉండే విటమిన్లు, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, యాంటీఆక్సిడెంట్లు మనలో ఎన్నో పోషకాల లోపాల్ని పోగొడుతాయి. అయితే కొన్నిసార్లు, రుతుస్రావం సమయంలో అధిక రక్తస్రావం అంటే అమెనోరియా పరిస్థితికి దారితీస్తుంది. అయితే కొబ్బరి నీరు దీని లక్షణాలను తగ్గించడానికి బాగా సహాయపడుతుంది.

ఆడవారు పీరియడ్స్ సమయంలో వివిధ సమస్యలను ఫేస్ చేస్తుంటారు. అయితే ఈ హెల్తీ పానీయం రుతుస్రావాన్ని సున్నితంగా చేయడానికి సహాయపడుతుంది. కొబ్బరి నీటిలో ఎలక్ట్రోలైట్స్ కూడా ఉంటాయి. ఇది మహిళలను హైడ్రేట్ గా ఉంచడానికి, బ్లీడింగ్ సులభంగా అయ్యేందుకు సహాయపడుతుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sneeze Reflex: అస‌లు మ‌న‌కు తుమ్ము ఎందుకొస్తుందో తెలుసా.?
ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.. చాలా ప్రమాదం