కారం పొడిని తినే అలవాటు లేదా? అయితే మీరు ఈ లాభాలను మిస్ అయినట్టే పో..

Published : Feb 21, 2023, 12:57 PM IST
 కారం పొడిని తినే అలవాటు లేదా? అయితే మీరు ఈ లాభాలను మిస్ అయినట్టే పో..

సారాంశం

ఎండు మిరపకాయల పొడి మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు.  ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. బరువును తగ్గిస్తుంది. అలాగో రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటుగా..  

వంటలను టేస్టీగా చేసే మసాలా దినుసులు మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. నిజానికి మసాలా దినుసులను వైద్యానికి, రుచి కోసం ఎన్నో ఏండ్ల నుంచి ఉపయోగిస్తూ వస్తున్నారు. మనలో చాలా మంది మసాలాలు లేని వంటలను అసలే తినరు. అసలు విషయానికొస్తే  రెడ్ చిల్లీ పౌడర్ మన ఆరోగ్యానికి  ఎంతో మేలు చేస్తుంది. ఎందుకంటే దీనిలో ఎన్నో ఔషదగుణాలు ఉన్నాయి. బరువును తగ్గించడం నుంచి ఇమ్యూనిటీ పవర్ ను పెంచడం వరకు ఈ మిర్చి పౌడర్ మనల్ని ఎన్నో సమస్యల నుంచి గట్టెక్కిస్తుంది. కారం పొడి మన ఆరోగ్యానికి ఏ విధంగా ఉపయోపడుతుందంటే..? 

రక్తపోటును నియంత్రిస్తుంది

ఎండు మిరప పొడిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తనాళాలను సడలించడానికి, రక్తపోటును నియంత్రించడానికి ఎంతో సహాయపడుతుంది. కారం పొడిని మోతాదులో తింటే రక్తపోటు పెరిగే అవకాశం తగ్గుతుంది. 

బరువును తగ్గిస్తుంది

ఎర్ర మిరపకాయల్లో క్యాప్సైసిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది మన శరీర జీవక్రియను పెంచడానికి బాగా సహాయపడుతుంది. దీంతో మీ శరీరంలోని అదనపు కేలరీలు సులువుగా బర్న్ అవుతాయి. 

రోగనిరోధక శక్తి పెరుగుతుంది

ఎండు మిరపకాయల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది మన రోగనిరోధక వ్యస్థను బలోపేతం చేస్తుంది. దీంతో దీర్ఘకాలిక రోగాలు సైతం ఇట్టే తగ్గుముఖం పడతాయి. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నవారు వంటల్లో ఎండుమిరప పొడిని వాడితే మంచిది. 

ధమనులను కాపాడుతాయి

ఎండు మిరపపొడిలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి మీ ధమనులను, రక్తనాళాలను అన్ బ్లాక్ చేయడానికి బాగా సహాయపడతాయి. 

జుట్టును, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది

రెడ్ చిల్లీ పౌడర్ లో విటమిన్ ఎ, విటమిన్ సి లు పుష్కలంగా ఉంటాయి. ఈ రెండు పోషకాలు మీ జుట్టును, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. 

నొప్పి, మంట తగ్గుతుంది

కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులతో బాధపడేవారికి రెడ్ చిల్లీ పౌడర్ మంచి మెడిసిన్ లా పనిచేస్తుంది. ఎందుకంటే దీనిలో నొప్పిని, మంటను తగ్గించే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. 

జీర్ణక్రియకు సహాయపడుతుంది

ఎండు మిరపకాయలు జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాదు ఇది జీర్ణప్రక్రియను వేగవంతం చేసే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటుంది. ఇది మలబద్దకం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది కూడా. ఫైనల్ దీనితో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా దీనిని మోతాదులోనే తినాలి. ఎక్కువగా తింటే ప్రయోజనాలకు బదులు నష్టాలు కలుగుతాయి. ఎన్నో సమస్యలు వస్తాయి జాగ్రత్త.. 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sneeze Reflex: అస‌లు మ‌న‌కు తుమ్ము ఎందుకొస్తుందో తెలుసా.?
ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.. చాలా ప్రమాదం