వంటింట్లో ఉండే ఈ మూలికల గురించి అసలు విషయం తెలిస్తే.. వాడకుండా ఉండనేలేరు..!

Published : Feb 19, 2023, 08:55 AM IST
 వంటింట్లో ఉండే ఈ మూలికల గురించి అసలు విషయం తెలిస్తే.. వాడకుండా ఉండనేలేరు..!

సారాంశం

మన దేశంలో చర్మం, జుట్టు, జీర్ణ సమస్యలను పోగొట్టడానికి ఎన్నో ఏండ్ల నుంచి కొన్ని మూలికలను ఉపయోగిస్తూ వస్తున్నారు. మీకు తెలుసా? ఇవి మన వంటింట్లోనే పుష్కలంగా ఉంటాయి. ఈ మూలికలు దగ్గు, జలుబు నుంచి ఎన్నో దీర్థకాలిక అనారోగ్య సమస్యలను ఇట్టే తగ్గిస్తాయి. 

ఆయుర్వేదంలో మూలికలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మన దేశంలో ఎన్నో రకాల మూలికలు ఉన్నాయి. వీటిని మందులుగా కూడా ఉపయోగిస్తున్నారు. ఎన్నో ఏండ్ల నుంచి మనదేశంలో వీటిని ఎన్నో వ్యాధులను తగ్గించుకోవడానికి ఉపయోగిస్తున్నారు. ఈ మూలికలు జుట్టు, చర్మం, దగ్గు, జలుబును తగ్గించడానికి ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. అంతేకాదు జీర్ణ సమస్యలను కూడా తగ్గిస్తాయి. చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుతాయి. 

మూలికల ఆరోగ్య ప్రయోజనాల 

జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది
శరీర పనితీరును ఉత్తేజపరుస్తుంది
ప్రసరణను పెంచుతుంది
శ్వాసకోశ వ్యవస్థను క్రిమిరహితం చేస్తుంది
నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. 

ఆరోగ్యానికి మేలు చేసే కొన్ని మూలికలు

తులసి 

తులసిలో యాంటీ సెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, డైజెస్టివ్, యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. అందుకే తులసిని టీలో కూడా ఉపయోగిస్తారు. వీటి ఆకులను అలాగే తిన్నా దీన్ని ప్రయోజనాలను పొందుతారు. ఇది మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దగ్గు, శ్వాసకోస సమస్యలను తగ్గిస్తుంది.

పసుపు 

పసుపు లేని కూరలు అసలే ఉండదు. నిజానికి పసుపు ఔషదం కంటే తక్కువేం కాదు. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడం నుంచి కణజాలాలను బలోపేతం చేయడం వరకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. పసుపు కూడా మన  ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. గాయాలను తొందరగా మాన్పిస్తుంది. ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. పసుపును తాజాగా లేదా పొడిగా కూడా ఉపయోగించొచ్చు. ఇది రక్తం గడ్డకట్టడానికి మంచిదని భావిస్తారు. దీనిని పాలలో వేసుకుని తాగితే మంచిది. 

కొత్తిమీర

కొత్తిమీర అపానవాయువు (పిత్తులు), పేగు తిమ్మిరి, కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కొత్తిమీర విత్తనాలు కూడా మన ఆరోగ్యానికి ప్రయోజనరంగా ఉంటాయి. కొత్తిమీరను ఎక్కువగా వంటకాలను గార్నిష్ చేయడానికి ఉపయోగిస్తారు.

అశ్వగంధ

అడాప్టోజెనిక్ హెర్బ్. ఈ హెర్బ్ ఒత్తిడి ప్రభావాలను తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. అలాగే మన శరీర పనితీరును బలోపేతం చేయడానికి కూడా పనిచేస్తుంది. అశ్వగంధ నాడీ వ్యవస్థను రిలాక్స్ చేయడానికి కూడా సహాయపడుతుంది. దీనిని టీలో ఉపయోగిస్తారు. 

వెల్లుల్లి 

దీనిలో యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. దీనిని మాంసం, చేపలు, సలాడ్ డ్రెస్సింగ్, పాస్తా సాస్, జున్ను, కూరగాయలలో ఉపయోగిస్తారు. వెల్లుల్లి రక్త ప్రసరణను పెంచుతుంది. శ్వాసనాళాన్ని క్రిమిసంహారక చేయడానికి కూడా సహాయపడుతుంది. రక్తపోటును తగ్గిస్తుంది.

వీటిని ఎలా ఉపయోగించాలి? 

ఎగ్ ఆమ్లెట్ లో తరిగిన కొత్తిమీర ఆకులను వేయొచ్చు. 
శాండ్విచ్ లో పుదీనా లేదా కొన్ని తులసి ఆకులను జోడించండి.
తాజా కొత్తిమీర ఆకులను బర్గర్ పై వేసుకుని తినొచ్చు. 
సలాడ్ డ్రెస్సింగ్ లో చిటికెడు శొంఠిని వేసుకోవచ్చు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sneeze Reflex: అస‌లు మ‌న‌కు తుమ్ము ఎందుకొస్తుందో తెలుసా.?
ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.. చాలా ప్రమాదం