
అల్లం పొడినే శొంఠి అని కూడా అంటారు. అల్లాన్ని ప్రతి వంటలో ఉపయోగిస్తారు. నిజానికి అల్లం వంటల రుచిని పెంచడమే కాదు మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది. ముఖ్యంగా దీన్ని తీసుకోవడం వల్ల మన శరీరం సీజనల్ ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశమే ఉండదు.
శొంటి గుండె జబ్బులను తగ్గిస్తుంది. శరీర మంటను కూడా తగ్గించడానికి సహాయపడుతుంది. ఆయాసం, గొంతు నొప్పి, కడుపు నొప్పి, పైత్యం, వాత, దగ్గు వంటి రోగాలను ఇట్టే తగ్గిస్తుంది. అంతేకాదు ఇది కీళ్ల వాపును కూడా తగ్గించడానికి సహాయపడుతుంది. కడుపు ఉబ్బరం సమస్య నుంచి తొందరగా ఉపశమనం కలిగిస్తుంది.
అల్లం అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది. అందుకే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు పొడి అల్లాన్ని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సలహానిస్తారు. అల్లంలో ఎన్నో బయోయాక్టివ్ అణువులు ఉంటాయి. ఇవి ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. శొంఠిని తీసుకోవడం వల్ల ప్రోటీన్, కొవ్వును విచ్చిన్నం చేయడానికి అవసరమైన ఎంజైమ్లు ఉత్పత్తి అవుతాయి. ఎండు అల్లం కూడా అనాల్జేసిక్ గా పనిచేస్తుంది. అంటే దీన్ని తీసుకోవడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
ఇతర కాలాలతో పోల్చితే చలికాలంలో మోకాళ్ల నొప్పులు, ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా కీళ్ల నొప్పులు ఈ సీజన్ లో మరింత ఎక్కువవుతాయి. వీళ్లు శొంఠిని తీసుకుంటే నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే డల్ స్కిన్, చుండ్రు సమస్యను పోగొట్టడానికి కూడా శొంఠి బాగా ఉపయోపడుతుంది. దీనిలో పాటుగా అతిగా తిని కడపు నొప్పితో బాధపడేవారికి కూడా ఇది చక్కటి మెడిసిన్ లా పనిచేస్తుంది.
శొంఠిని ఎన్నో మార్గాల్లో తినొచ్చు. రాత్రిపూల పాలను తాగే వారు చాలా మందే ఉన్నారు. అయితే ఈ పాలలో కొద్దిగా అల్లం పొడిని కలుపుకుని కూడా తాగొచ్చు. ఇది మీరు హాయిగా పడుకోవడానికి సహాయపడుతుంది.
అయితే కొద్దిగా అల్లం పొడిని తీసుకుని వేడి చేయండి. దీన్ని బెల్లం పొడడి నెయ్యితో కలిపి తినండి. ఇలా తింటే మీరు రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటారు. అలసట అనేదే ఉండని నిపుణులు చెబుతున్నారు.
పిల్లలకు కూడా శొంఠిని పెట్టొచ్చు. అయితే పెద్దలు తీసుకునే విధంగా పిల్లలకు శొంఠిని ఇవ్వకూడదు. వీళ్లను శొంఠిని ఇవ్వడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. అందులో ఒకటి.. శొంఠిని, నెయ్యిని, బెల్లాన్ని, పసుపును సమాన పరిమాణంలో తీసుకోండి. దీన్ని చిన్న చిన్న ఉండలుగా తయారుచేసి పిల్లలకు ఇవ్వాలని ఆరోగ్య నిపుణులు సలహానిస్తున్నారు. ఇది పిల్లల్లో దగ్గును, ఫ్లూ, జలుబు వంటి సమస్యలను తగ్గిస్తుంది.
ఒకవేళ మీకు చాయ్ అలవాటుంటే.. అందులో కొద్దిగా అల్లం పొడిని వేసి తయారుచేయండి. చలికాలంలో ప్రతి ఒక్కరూ ఈ మసాలా టీని తాగడానికి బాగా ఇష్టపడతారు. అల్లం చల్లని వాతావరణంలో మన శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి సహాయపడుతుంది. నిజానికి అల్లం టీ సూపర్ టేస్టీగా ఉంటుంది.