
ప్రతి ఒక్కరూ యవ్వనంగా ఉండాలని కోరుకుంటారు. వయసు పెరుగుతున్నా... ఆ వయసు కనిపించకుండా ఉండాలని చాలా మంది కోరుకుంటారు. కానీ..... మన అలవాట్ల కారణంగా.. వయసుకు మించి కనిపిస్తారు. తొందరగా వృద్ధాప్యం దరిచేరుతుందట. ఏ అలవాట్ల కారణంగా తొందరగా వృద్ధాప్యం దరిచేరుతుందో ఓసారి చూద్దాం...
1.ఆల్కహాల్..
చాలా మందికి మద్యం తాగే అలవాటు ఎక్కువగా ఉంటుంది. అయితే.. మద్యం ఎక్కువగా తాగే అలవాటు ఉన్నవారు తొందరగా వృద్ధాప్యానికి చేరుకుంటారు. వయసుకు మించి కనపడతారు. అంతేకాదు... మద్యం సేవించడం వల్ల ఆరోగ్యం కూడా పాడౌతుంది. అనారోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి.
2.సరైన నిద్ర లేకపోవడం...
ఈ రోజుల్లో చాలా మంది పని ఒత్తిడి కారణంగా సరైన నిద్రను పొందడం లేదు. కావాలనే అర్థరాత్రి వరకు ఫోన్లు చూడటం లేదంటే.. నిజంగా పని కారణంగా ఎక్కువ గంటలు మేల్కొని ఉండటం వల్ల.. ఇలా కారణం ఏదైనా చాలా మంది రోజులో కనీసం ఎనిమిది గంటలు కూడా నిద్రపోవడం లేదు. దీని వల్ల కూడా తొందరగా వృద్ధాప్యం వచ్చేస్తుందట.
3.సరైన పోషకాహారం..
ఈ రోజుల్లో చాలా మందికి పోషకాహారాన్ని పక్కన పెట్టేసి.. జంక్ ఫుడ్స్ తినడానికి అలవాటు పడిపోతున్నారు. ఈ క్రమంలో... సరైన పోషకాహారం, సరైన డైట్ ఫాలో కాకపోవడం వల్ల కూడా.. తొందరగా వృద్ధాప్యం దరిచేరుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
4.వ్యాయామం చేయకపోవడం...
వ్యాయామం చేయడం వల్ల... మనం యవ్వనంగా కనిపించే అవకాశం ఉంటుంది. అలా కాకుండా... వ్యాయామం చేయకుండా, శరీరానికి ఫిజికల్ యాక్టివీటీస్ అనేది లేకుండా ఉండటం వల్ల కూడా తొందరగా వృద్ధాప్యం దరిచేరుతుందట. కాబట్టి...యవ్వనంగా కనిపించాలంటే ప్రతిరోజూ వ్యాయామం చేయడం చాలా అవసరం.
5.ఒత్తిడి...
ఎక్కువ ఒత్తిడికి గురయ్యే వారు కూడా... తొందరగా వృద్ధాప్యానికి చేరుకుంటారట. ఎలాంటి ఒత్తిడి ఉన్నా... అది మన శరీరంపై ప్రభావం చూపిస్తుంది. తద్వారా తొందరగా ముసలివాళ్లం అయిపోయినట్లుగా కనిపిస్తూ ఉంటాం.
6.కెఫైన్..
చాలా మందికి ప్రతిరోజూ కాఫీ, టీ తాగుతూ ఉంటారు. వీటిని ఎక్కువగా తాగుతూ ఉండటం వల్ల వాటిలోకి కెఫైన్ ఎక్కువగా శరీరంలోకి వెళ్లడం వల్ల తొందరగా వృద్ధాప్యం దరిచేరుతుందట. తొందరగా మసులివారిలాగా కనపడతారట.
7.సీజనల్ ఫుడ్స్ తినకపోవడం..
మనకు ప్రతి సీజన్ లో ప్రత్యేకంగా కొన్ని రకాల ఫుడ్స్ లభిస్తూ ఉంటాయి. అయితే... చాలా మంది వాటిని తినడంలో నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. సీజనల్ ఫుడ్స్ తినడం వల్ల మనం యవ్వనంగా కనిపించే అవకాశం ఉంటుంది. వాటిని నిర్లక్ష్యం చేయడం వల్ల కూడా తొందరగా వృద్ధాప్యం దరిచేరుతుందట.
8.పొగతాగడం..
పొగతాగే అలవాటు ఉన్నవారు కూడా తొందరగా వృద్ధులుగా మారుతూ ఉంటారట. స్మోకింగ్ అలవాటు...కూడా శరీరంపై ఎక్కువ ప్రభావం చూపిస్తుందట. అంతేకాదు.. మీ ఆరోగ్యం పై కూడా చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది.