గర్భిణులు కాకరకాయ తింటే ఏమౌతుందో తెలుసా?

Published : Apr 12, 2023, 07:15 AM IST
గర్భిణులు కాకరకాయ తింటే ఏమౌతుందో తెలుసా?

సారాంశం

కాకరకాయలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. గర్బిణులు కాకరకాయలను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.   

గర్భిణులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆరోగ్యం, ఆహారం విషయంలో. శిశువు ఆరోగ్యకరమైన పెరుగుదల, అభివృద్ధి కోసం గర్భధారణ సమయంలో సమతుల్య ఆహారం తీసుకోవాలి.  ఇతరులే కాదు గర్భిణులు కూడా కాకరకాయలను పక్కన పెట్టేస్తుంటారు. ఎందుకంటే ఇది చేదుగా ఉంటుందని. కానీ  ఈ కూరగాయలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు ఈ కూరగాయ ఎంతో మేలు చేస్తుంది.  గర్భధారణ సమయంలో కాకరకాయ తినడం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ:  ప్రెగ్నెన్సీ  డయాబెటీస్ ఉన్న గర్భిణీ స్త్రీలకు కాకరకాయ ఎంతో మంచి చేస్తుంది. ఎందుకంటే దీనిలో బ్లడ్ షుగర్ లెవెల్స్ ను పెంచే కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి బాగా సహాయపడుతుంది.

జీర్ణక్రియకు సహాయపడుతుంది: గర్భిణులు ఎక్కువగా మలబద్ధకం, ఉబ్బరం, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలను ఎదుర్కొంటారు. కాకరకాయలో ఎక్కువ మొత్తంలో ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. అలాగే సాధారణ ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది: కాకరకాయలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి గర్భిణుల రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఇది గర్భిణీ స్త్రీలకు అంటువ్యాధులు, ఇతర వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది. తల్లి, బిడ్డను ఆరోగ్యంగా ఉంచుతుంది. 

ఆరోగ్యకరమైన చర్మం: కాకరకాయ విటమిన్ సి కి గొప్ప మూలం. ఇది ఆరోగ్యకరమైన చర్మానికి చాలా అవసరం. గర్భిణులు కాకరకాయను తినడం వల్ల మొటిమలు, పిగ్మెంటేషన్ వంటి చర్మ సమస్యలు వచ్చే అవకాశం  తగ్గుతుంది. 

పుట్టుకతో వచ్చే లోపాల ప్రమాదం తగ్గుతుంది: కాకరకాయలో ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది శిశువు ఆరోగ్యంగా పెరిగేందుకు, అభివృద్ధికి అవసరం. గర్భధారణ సమయంలో ఫోలిక్ యాసిడ్ తగినంతగా తీసుకోవడం వల్ల శిశువులో పుట్టుకతో వచ్చే లోపాల ప్రమాదం చాలా తగ్గుతుంది. 

ఆరోగ్యకరమైన బరువుకు: కాకరకాయలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ప్రెగ్నెన్సీ సమయంలో బరువు పెరగకూడదంటే గర్భిణులు కాకరకాయను తీసుకోవాలి. కాకరకాయ గర్భిణుల కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. అలాగే అతిగా తినడాన్ని తగ్గిస్తుంది.

అవసరమైన పోషకాలను అందిస్తుంది: కాకరకాయలో ఇనుము, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ ఎ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. శిశువు ఆరోగ్యకరమైన పెరుగుదల, అభివృద్ధికి ఈ పోషకాలు చాలా  చాలా అవసరం. 
 

PREV
click me!

Recommended Stories

Sneeze Reflex: అస‌లు మ‌న‌కు తుమ్ము ఎందుకొస్తుందో తెలుసా.?
ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.. చాలా ప్రమాదం