ప్రెగ్నెన్సీ సమయంలో చేయాల్సినవి, చేయకూడనివి ఇవే..!

Published : Apr 11, 2023, 12:48 PM IST
 ప్రెగ్నెన్సీ సమయంలో చేయాల్సినవి, చేయకూడనివి ఇవే..!

సారాంశం

గర్బిణులు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. తల్లీ, బిడ్డల ఆరోగ్యం రిస్క్ లో పడొచ్చు. అందుకే గర్బిణులకు ఆరోగ్యం గురించి అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది ఏప్రిల్ 11న నేషనల్ సేఫ్ ప్రెగ్నెన్సీ డేను జరుపుకుంటారు. 

గర్భిణులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా తల్లులు. తల్లులు ఆరోగ్యంగా ఉంటేనే బిడ్డ ఆరోగ్యం బాగుంటుంది. ప్రతి ఏడాది ఏప్రిల్ 11 న నేషనల్ సేఫ్ ప్రెగ్నెన్సీ డే ను జరుపుకుంటారు. గర్భధారణ  సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేదే ఈ రోజు ముఖ్య ఉద్దేశ్యం. ప్రసూతి ఆరోగ్యం, సురక్షితమైన ప్రసవం ప్రాముఖ్యతను ఈ రోజు నొప్పి చెబుతుంది. ఈ డే సందర్భంగా గర్భధారణ సమయంలో చేయవలసిన, చేయకూడని కొన్ని విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

మంచి నిద్ర 

గర్భిణులు ప్రతిరోజు రాత్రి కనీసం 7-8 గంటలు నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు, డాక్టర్లు చెబుతున్నారు. గర్భిణులు కంటినిండా నిద్ర పోవాలంటే రాత్రిపూట కెఫిన్ ను తీసుకోకూడదు. ఎందుకంటే కెఫిన్ నిద్రను దెబ్బతీస్తుంది. 

వ్యాయామం 

గర్భధారణ సమయంలో చురుకుగా ఉండటం వల్ల తల్లీ, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల హృదయనాళ ఆరోగ్యం మెరుగుపడుతుంది. కండరాల బలం పెరుగుతుంది. అలాగే ఒత్తిడిని తగ్గిస్తుంది. గర్భధారణ మధుమేహం, ప్రీ-ఎక్లాంప్సియా ప్రమాదాన్ని తగ్గించడానికి వ్యాయామం ఎంతో సహాయపడుతుంది.

హైడ్రేటెడ్ గా ఉండండి

పుష్కలంగా నీటిని తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. నీళ్లు ఆరోగ్యకరమైన రక్తపోటును నిర్వహించడానికి, మలబద్దకాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లను, ముందస్తు ప్రసవ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

ఆరోగ్యకరమైన ఆహారం 

సమతుల్య ఆహారంలో వివిధ రకాల పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు, పాల ఉత్పత్తులు ఉండాలి. గర్భధారణ సమయంలో పెరుగుతున్న పిండాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి రోజువారీ కేలరీలు తీసుకోవడాన్ని 300-500 కేలరీలు పెంచాలని నిపుణులు చెబుతున్నారు. 

ధూమపానం 

సిగరేట్ పొగలోని రసాయనాలు మావిని దాటి పిండానికి చేరుతాయి. అకాల జననం, తక్కువ బరువు, ప్రసవం, ఆకస్మిక శిశు మరణ సిండ్రోమ్ (ఎస్ఐడిఎస్) వంటి అనేక ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని ఈ స్మోకింగ్ పెంచుతుంది. గర్భధారణ సమయంలో ధూమపానం చేస్తే రక్తస్రావం, ప్రసవ సమయం కష్టంగా ఉంటుంది. 

మద్యం 

ఆల్కహాల్ కూడా మావి ద్వారా పిండానికి వెళుతుంది. ఇది పిండం ఆల్కహాల్ స్పెక్ట్రం డిజార్డర్స్ (ఎఫ్ఎఎస్డి), ఇతర అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.

PREV
click me!

Recommended Stories

Sneeze Reflex: అస‌లు మ‌న‌కు తుమ్ము ఎందుకొస్తుందో తెలుసా.?
ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.. చాలా ప్రమాదం