కళ్లలో ఈ మార్పు.. జాగ్రత్త పడాల్సిందే..!

Published : Apr 11, 2023, 02:42 PM IST
కళ్లలో ఈ మార్పు.. జాగ్రత్త పడాల్సిందే..!

సారాంశం

డయాబెటీస్ కూడా కళ్లపై ఎంతో ప్రభావాన్నిచూపుతుంది. దీన్ని మరు గుర్తించకపోతే కంటిచూపు మొత్తమే కోల్పోవచ్చు. డయాబెటీస్ వల్ల కళ్లలో ఎలాంటి మార్పులు కన్పిస్తాయో తెలుసా?   

డయాబెటీస్ పేషెంట్ల సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకు పెరిగిపోతోంది. ఇది పూర్తిగా నయం చేసుకోలేని వ్యాధి. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణ లేకుండా పెరిగిపోవడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చితే భారతదేశంలోనే డయాబెటీస్ రోగలు ఎక్కువగా ఉన్నారట. అందుకే భారతదేశాన్ని డయాబెటీస్ రాజధాని అంటారు. 

డయాబెటీస్ లో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి టైప్ 1 డయాబెటీస్. ఇది స్వయం ప్రతి రక్షక వ్యాధి. దీనిలో శరీరం రోగనిరోధక వ్యవస్థ ప్యాంక్రియాసిస్ లోని ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలపై దాడి చేస్తుంది. ఇక రెండు టైప్ 2 డయాబెటీస్. ఇది శరీరం ఉత్పత్తి చేసే ఇన్సులిన్ కు నిరోధకతను కలిగిస్తుంది. లేదా రక్తలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఇన్సులిన్ తగినంత ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయదు. 

డయాబెటీస్ ఉంటే శరీరంలో ఎన్నో మార్పులు కనిపిస్తాయి. వీటిలో కళ్లు ఒకటి. అవును డయాబెటీస్ ఉంటే మీ కళ్లపై ప్రభావం  పడుతుంది. వీటి లక్షణాలను గమనించకుండా వదిలేస్తే దృష్టి నష్టం కలుగుతుంది. అసలు డయాబెటీస్ వల్ల కళ్లలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..

డయాబెటీస్ లక్షణాలు

  • అస్పష్టమైన కంటి చూపు లేదా ఏవీ కూడా స్పష్టంగా కనిపించకపోవడం
  • కొన్ని సార్లు కంటిచూపులో మార్పులు
  • దృష్టి నష్టం
  • రంగులను సరిగ్గా గుర్తించకపోవడం
  • కళ్లలో మచ్చలు
  • కంటిలో అసౌకర్యం
  • ఎక్కువ కాంతిని చూడలేకపోవడం

డయాబెటీస్ ప్రభావం కళ్లపై పడకూడదంటే ఈ చిట్కాలను రోజూ ఫాలో అవ్వండి

  • రక్తంలో చక్కెర స్థాయిలను ఎప్పుడూ కూడా నియంత్రణలో ఉంచుకోవడం
  • మీ కళ్లను తరచుగా చెక్ చేయడం
  • కంటిచూపులో ఏవైనా మార్పును గమనిస్తే వెంటనే  హాస్పటల్ కు వెళ్లడం
  • అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ వంటి సమస్యలను నియంత్రించడం
  • ఆరోగ్యకరమైన  ఆహారాలను తినడం, రోజూ వ్యాయామం చేయడం

PREV
click me!

Recommended Stories

Sneeze Reflex: అస‌లు మ‌న‌కు తుమ్ము ఎందుకొస్తుందో తెలుసా.?
ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.. చాలా ప్రమాదం