మొదలైన వేసవి కాలం...వడదెబ్బ నుంచి ఉపశమనం పొందాలంటే ఇలా చేయాల్సిందే!

Published : Feb 28, 2023, 03:43 PM IST
మొదలైన వేసవి కాలం...వడదెబ్బ నుంచి ఉపశమనం పొందాలంటే ఇలా చేయాల్సిందే!

సారాంశం

వేసవికాలం మొదలవడంతో వాతావరణంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. వేసవికాలం లో భానుడి ప్రతాపం పెరిగిపోవడంతో ఎక్కువగా వడదెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఎండాకాలంలో వేసవి తాపం నుంచి ఈ వడదెబ్బ నుంచి ఉపశమనం పొందాలంటే ఈ పద్ధతులను తప్పనిసరిగా పాటించాలి.  

వేసవికాలంలో ఎండ తీవ్రతకు తొందరగా మన శరీరం డిహైడ్రేషన్ అవుతుంది. ఇలా డిహైడ్రేషన్ కారణంగా వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే వీలైనంతవరకు మధ్యాహ్నం 12 గంటలు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు బయట తిరగకపోవడం మంచిది. తప్పనిసరి పరిస్థితులలో బయటకు వెళ్లాల్సి గనుక వస్తే గొడుగు తీసుకుని వెళ్లడం లేదా వీలైనంతవరకు చల్లని ప్రదేశంలో మన పనులు పూర్తయ్యేలా చూసుకోవాలి.

ఇక ఎండలో అధికంగా తిరగటం వల్ల మన శరీరంలోని రక్త కణాలు కుచించక పోయి రక్తప్రసరణ సరిగా జరగక ఈ ప్రభావం మన శరీరంలోని మెదడు లివర్ కిడ్నీ వంటి భాగాలపై అధికంగా పడే అవకాశాలు ఉన్నాయి. వడదెబ్బకు గురైన వారిలో ఎక్కువగా వేవీళ్లు రావడం, చెమటలు పట్టడ పల్స్ రేట్ పడిపోవడం వంటివి జరుగుతుంటాయి ఇలా ఎవరికైనా వడదెబ్బ కనుక తగిలితే వెంటనే వారిని ఒక చల్లని గాలి తగిలి ప్రదేశానికి తీసుకువెళ్లాలి.

వారి దుస్తులను కాస్త వదులు చేసి నీళ్లతో తడపాలి. ఇలా చేయటం వల్ల రక్త కణాలు కుచించకపోవు. వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్యుల పర్యవేక్షణలో శరీరంలోని నీటి శాతం పెంచేందుకు ఐవి ఫ్లూయిడ్స్‌ అందించాలి. బయటకు వెళ్ళేటప్పుడు టోపీలు, స్కార్ఫ్‌లు వాడితే మంచిది. ప్రతి అర్ధగంటకు మూడు వందల మిల్లీలీటర్ల చొప్పున రోజుకు ఐదారు లీటర్లకు తగ్గకుండా నీరు తాగాలి.

వేసవికాలంలో తగినంత నిద్రపోవాలి. వేసవిలో నీళ్లు ఎంత ఎక్కువగా తాగితే అంత మంచిది. వీలైనంతవరకు పండ్ల రసాలు, తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను తీసుకోవాలి.ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో కనీసం 20 నిమిషాలైనా వ్యాయామం లేదా వాకింగ్ చేయడం ఉత్తమం.

PREV
click me!

Recommended Stories

Headache: ఉదయం లేవగానే తలనొప్పి బాధిస్తోందా..? కారణాలు ఇవే..!
Health Tips: టమాటాలు ఎక్కువగా తింటున్నారా? ఈ సమస్యలు తప్పవు జాగ్రత్త..!