గుండెను దెబ్బతీసే రోగాలు.. లక్షణాలు ముందే తెలుసుకుంటే మీరు సేఫ్..!

Published : Apr 17, 2023, 11:43 AM IST
గుండెను దెబ్బతీసే రోగాలు.. లక్షణాలు ముందే తెలుసుకుంటే మీరు సేఫ్..!

సారాంశం

జీవన శైలిలోని పొరపాట్లే యువతకు కూడా గుండె జబ్బులు వచ్చేలా చేస్తున్నాయని ఆరోగ్య నిపుణులు నొక్కి చెబుతున్నారు. వ్యాయామం చేయకపోవడం, సరైన ఆహారాన్ని తినకపోవడం, ఒత్తిడి వంటివన్నీ గుండె ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నాయి. 

చిన్న చిన్న పిల్లలు కూడా గుండె జబ్బులతో బాధపడుతున్నారు. గుండెపోటుతో చనిపోతున్నారు. కానీ ఒకప్పుడు పెద్దవయసు వారికి మాత్రమే గుండె పోటు ఇతర గుండె సమస్యలు వచ్చేవి. చిన్నవయసు వారికి గుండె జబ్బులు రావడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. అందులో జీవన శైలి కూడా ఒకటని నిపుణులు చెబుతున్నారు.

మన జీవనశైలికి సంబంధించిన ఎన్నో పొరపాట్లు యువతలో గుండె సమస్యల ప్రమాదాన్ని పెంచుతున్నాయని వైద్యులు పదేపదే చెబుతున్నారు. సరైన ఆహారం తీసుకోకపోవడం, వ్యాయామం చేయకపోవడం, ఒత్తిడి, బీపీ, ఎక్కువ సేపు కూర్చోవడం, ధూమపానం, మితిమీరిన మద్యపానం, స్థూలకాయం, కొలెస్ట్రాల్ వంటివే గుండె పోటుకు కారణమవుతున్నాయి. గుండె జబ్బులను ముందుగానే ఎలా నివారించాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

ముందుగా గమనించాల్సిన లక్షణాలు

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది గుండెపోటుకు ప్రధాన సంకేతం. అయితే అందరికీ రావాలని లేదు. అయితే మీకు ఏరకమైన శ్వాసతీసుకోవడంలో ఇబ్బందిని ఎదుర్కొన్నా.. ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది మీ గుండె ఇబ్బందుల్లో ఉందనడానికి సంకేతం కావొచ్చు. శ్వాస ఆడకపోవడం గుండె ఇబ్బందుల్లో ఉందనడానికి సంకేతం కాదు. అయితే టెస్టులు ఖచ్చితంగా చేయించుకోవాలి. 

ఛాతీ  నొప్పి, ఒత్తిడి, నొప్పి, అసౌకర్యం, మంట, కత్తిపోటు, ఎడమ భుజంలో నొప్పి, దడ, వెన్నునొప్పి, పొత్తికడుపు నొప్పి, విపరీతంగా చెమటలు పట్టడం, పాదాల వాపు, నిద్రలేమి, ఎప్పుడూ అలసట, శక్తి లేకపోవడం, మైకము, లైంగిక ఆసక్తి లేకపోవడం, అంగస్తంభన సమస్యలు, చిగుళ్ల నుంచి రక్తస్రావం వంటివన్నీ గుండె గుండె వైఫల్యానికి సంకేతాలు.

అందుకే మీలో ఈ లక్షణాలన్నీ కనిపిస్తే వీలైనంత త్వరగా హాస్పటల్ కు వెళ్లండి. అలాగే ఈ లక్షణాలన్నీ ఖచ్చితంగా మీకు గుండెపోటు వచ్చిందని నిర్దారించకపోవచ్చు. ఇందుకోసం ఖచ్చితంగా టెస్టులు చేయించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. గుండె ఆరోగ్యాన్ని నిర్ధారించడానికి ఇసీజీ, ఎకోతో సహా పరీక్షలు చేయాలి.

రోగనిరోధక శక్తి

రోగనిరోధక శక్తిని పెంచడంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఆరోగ్యకరమైన ఆహారం కూడా గుండె సమస్యలను చాలా వరకు నివారిస్తుందంటున్నారు నిపుణులు. విటమిన్ -డి లోపం గుండె ను రిస్క్ లో పడేస్తుంది. కాబట్టి విటమిన్ డి లోపాన్ని గుర్తిస్తే వైద్యుల సూచనల మేరకు సప్లిమెంట్లు తీసుకోవాలి.

పొటాషియం గుండె ఆరోగ్యానికి మరొక ముఖ్యమైన పదార్ధం. అరటిపండ్లు, బచ్చలికూర, క్యారెట్లు, బంగాళాదుంపలు, బీన్స్, బాదం, గుడ్లు, పాల ఉత్పత్తులన్నీ మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. 

మెగ్నీషియం కూడా గుండెకు చాలా అవసరం. అవొకాడో, క్వినోవా, గుమ్మడికాయ గింజలు, పొద్దుతిరుగుడు విత్తనాలు, మందపాటి పెరుగు, అవిసె గింజలు, బెండకాయ, నల్ల బెర్రీలు, చెర్రీస్, పీచెస్. గ్రీన్ క్యాప్సికమ్ మొదలైన వాటిలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.  సిట్రస్ పండ్లు, చిక్కుళ్ళు, గింజలు, కాయలు, విత్తనాలు కూడా గుండె ఆరోగ్యానికి మంచి ఆహారాలు.

PREV
click me!

Recommended Stories

Headache: ఉదయం లేవగానే తలనొప్పి బాధిస్తోందా..? కారణాలు ఇవే..!
Health Tips: టమాటాలు ఎక్కువగా తింటున్నారా? ఈ సమస్యలు తప్పవు జాగ్రత్త..!