రోజూ వైన్... నిత్య యవ్వనం మీ సొంతం

By telugu teamFirst Published Jan 21, 2020, 2:43 PM IST
Highlights

బ్లాక్ బెర్రీ, వోట్స్ లాంటి వాటితో చేసిన వైన్ మాత్రమే ఆరోగ్యానికి మంచిదట. దాంట్లో కార్బనెట్ ఎక్కువగా ఉంటుందట. దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా ఉండాలంటే పై రెండు రకాల వైన్ తాగాల్సిందేనని పరిశోధకులు చెబుతున్నారు. వై
 

మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఈ విషయం మనందరికీ తెలిసిందే. అయితే.. వైన్ విషయంలో మాత్రం ఇది నిజం కాదని ఓ సర్వేలో తేలింది. వైన్ తాగడం వల్ల  నిత్య యవ్వనంగా మారే అవకాశం ఉందట. పరిశోధకులు జరిపిన ఓ పరిశోధనలో తేలింది.

 రోజూ కొద్దిమొత్తంలో వైన్‌ తాగడం వలన పలు రోగాల బారి నుంచి తప్పించుకోవచ్చన్నవిషయం తాజా పరిశోధనల్లో తేలింది. అయితే బ్లాక్ బెర్రీ, వోట్స్ లాంటి వాటితో చేసిన వైన్ మాత్రమే ఆరోగ్యానికి మంచిదట. దాంట్లో కార్బనెట్ ఎక్కువగా ఉంటుందట. దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా ఉండాలంటే పై రెండు రకాల వైన్ తాగాల్సిందేనని పరిశోధకులు చెబుతున్నారు.

Also Read పదిరోజుల్లో పెళ్లి... వధువు తల్లితో వరుడి తండ్రి లేచిపోయాడు..

వైన్‌ని రోజూ తీసుకునే వారిలో ఆయుష్షు పెరుగుతుందన్న విషయం పరిశోధనల్లో స్పష్టమైంది. రెగ్యులర్ వైన్‌ తాగడం వలన మరొక లాభం కూడా ఉంది. అదేమిటంటే యవ్వనంగా ఉండడం, కనిపించడం. చర్మం మీద ఉన్న ముడతలను తొలగిస్తుందట. నిత్య యవ్వనంగా ఉంచుతుందట. వృద్ధాప్య లక్షణాలు రాకుండా చేస్తుందట. రెడ్ వైన్ లో ఉండే రెస్వెట్రాల్ వృద్ధాప్య లక్షణాలను రానివ్వదట. అలాగని మోతాదుకు మించి తాగితే ప్రమాదమే అని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

click me!