వ్యాయామం... తిన్నాకా..? తినకముందా?

By telugu teamFirst Published Nov 4, 2019, 4:45 PM IST
Highlights

బాత్ అండ్ బర్మింగ్ హామ్ యూనివర్శిటీ చేపట్టిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడయ్యింది. వ్యాయామం చేసే సమయంలో... ఆహారం తీసుకునే సమయంలో చేసే మార్పుల ద్వారా ఆరోగ్యంలో సానుకూల మార్పులు తీసుకురావచ్చని నిపుణులు చెబుతున్నారు.

బ్రేక్ ఫాస్ట్ తీసుకున్న తర్వాత వ్యాయామం చేయాలని చాలా మంది చెబుతుంటారు. మరికొందరేమో లేదు లేదు... పరగడుపన చేస్తేనే సరైన ఫలితం దక్కుతుందని  చెబుతుంటారు. దీనిపై ఓ సంస్థ తాజాగా సర్వే చేసింది. ఆ సర్వేలో చాలా ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ చేయక ముందు వ్యాయామం చేస్తే రక్తంలో షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయని ఆ పరిశోధనలో తేలింది. ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం వల్ల శరీరంలోని ఇన్సులిన్ వాడకాన్ని సమర్థంగా నిర్వహించుకోగలుగుతామని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా టైపు 2 డయాబెటిస తో పోరాడటంతోపాటు జీవక్రియల వేగం పెంచేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందని వారు చెబుతున్నారు.

బాత్ అండ్ బర్మింగ్ హామ్ యూనివర్శిటీ చేపట్టిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడయ్యింది. వ్యాయామం చేసే సమయంలో... ఆహారం తీసుకునే సమయంలో చేసే మార్పుల ద్వారా ఆరోగ్యంలో సానుకూల మార్పులు తీసుకురావచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఖాళీ కడుపుతో వ్యాయామం చేసిన వారి కండరాలు ప్రొటీన్‌ను మెరుగ్గా సంగ్రహిస్తున్నట్టు తమ అథ్యయనం గుర్తించామని తెలిపారు. బరువు తగ్గే క్రమంలో వ్యాయామానికి ముందు లేదా తర్వాత ఆహారం తీసుకునే సమయంతో సంబంధం లేకపోయినా వారి ఆరోగ్యంపై మాత్రం ఇది సానుకూల ప్రభావం చూపుతుందని చెప్పారు.
 
click me!