వర్షాకాలంలో ఆకుకూరలు తినాలా? వద్దా?

By Shivaleela Rajamoni  |  First Published Jul 3, 2024, 3:57 PM IST

వర్షాకాలంలో మార్కెట్ లో రకరకాల ఆకు కూరలు ఉంటాయి. ఆరోగ్యానికి మంచివని వీటిని రెగ్యులర్ గా తింటుంటారు. కానీ ఈ సీజన్ లో ఆకులకు పురుగులు, కీటకాలు ఎక్కువగా పడతాయి. అందుకే ఈ సీజన్ లో ఆకు కూరలను తినాలా? వద్దా? అని తెలుసుకుందాం పదండి.



వర్షాకాలం చిరుజల్లులు వేడి నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. కానీ ఈ చల్లని సీజన్ లో మనకు లేనిపోని రోగాలు వచ్చే ప్రమాదం ఉంది. వర్షాకాలంలో దగ్గు, జలుబు, జ్వరం, ఫుడ్ పాయిజనింగ్, మలేరియా, డయేరియా మొదలైన వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి. ఎందుకంటే మారుతున్న వాతవారణం వల్ల మన శరీర రోగనిరోధక శక్తి బాగా తగ్గిపోతుంది. ఇలాంటి సమయంలో ఆకు కూరలను తినాలా? వద్దా? అనేది తెలుసుకుందాం పదండి. 

వర్షాకాలంలో ఆకుపచ్చని రకరకాల కూరగాయలను బాగా పండిస్తారు. కానీ ఈ సీజన్ లో, చల్లని వాతావరణంలో ఆకుకూరలను తినకపోవడమే మంచిది. ఎందుకంటే వర్షాకాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఆకుపచ్చని కూరగాయల్లో సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియా పెరిగే ప్రమాదం ఉంది.  దీనివల్ల ఈ సీజన్ లో కూరగాయల్లో కూడా కీటకాలు ఎక్కువగా ఉంటాయి. 

Latest Videos

undefined

ఈ సీజన్ లో ఆకు కూరలైన బచ్చలికూర, పాల కూర, మెంతికూర, కాలీఫ్లవర్, క్యాబేజీ వంటి ఆకుకూరలకు దూరంగా ఉండటమే మేలు. వీటితో పాటుగా ఈ సీజన్ లో వంకాయలను కూడా తినకూడదు. ఎందుకంటే ఈ ఆకుకూరలను వర్షాకాలంలో తింటే జీర్ణ సమస్యలు వస్తాయి. అందుకే ఈ సీజన్ లో ఆకుకూరలను తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఈ సీజన్ లో కూడా మీరు ఆకు కూరలను తినాలనుకుంటే వాటిని ముందు వేడి నీటిలో ఉప్పు వేసి బాగా కడగండి. దీంతో ఆ కూరగాయలకు ఉన్న బ్యాక్టీరియా నశిస్తుంది. చాలా మంది వంట చేయడానికి కూరగాయలను ఎప్పుడో ముందుగానే కట్ చేసి పెడుతుంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. దీనివల్ల బ్యాక్టీరియా ఆకుల్లోని బ్యాక్టీరియా వాటి లోపలికి వెళ్లిపోతుంది. ఇవి మన కంటికి కనిపించకుండా దాక్కుంటాయి. అందుకే ఆకు కూరలను ఎప్పుడూ కూడా వంట చేసేటప్పుడు మాత్రమే కట్ చేయాలి. 

వర్షకాలంలో రోగాలు రాకుండా ఉండాలంటే మార్కెట్ నుంచి తాజా కూరగాయలను తీసుకొచ్చి వంట చేయండి. అలాగే వారానికి సరిపడా కూరగాయలను కొని వాటిని ఎక్కువ రోజులు ఫ్రిజ్ లో నిల్వ చేయడం మానుకోండి. 
 

click me!