పాము విషంతో కరోనా మహమ్మారికి మందు..!

By telugu news teamFirst Published Sep 1, 2021, 11:33 AM IST
Highlights

బ్రెజిల్ పరిశోధకులు చేసిన పరిశోధనలో... పాము విషంతో కరోనా మహమ్మారిని పూర్తిగా ఎదుర్కోవచ్చని తేలింది.

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ మహమ్మారికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ.. అది పూర్తి స్థాయిగా మహమ్మారిని పారద్రోల లేకపోతోంది. వ్యాక్సిన్ తీసుకున్నవారికి సైతం మళ్లీ కరోనా ఎటాక్ చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో.. బ్రెజిల్  పరిశోధకులు ఓ శుభవార్త తెలియజేశారు.

బ్రెజిల్ పరిశోధకులు చేసిన పరిశోధనలో... పాము విషంతో కరోనా మహమ్మారిని పూర్తిగా ఎదుర్కోవచ్చని తేలింది. ఒకరకం పాము విషంలోని అణువుతో.. కరోనా మహమ్మారిని 75శాతం నిరోధిస్తుందని తేలింది.

"పాము విషం యొక్క ఈ భాగం వైరస్ నుండి చాలా ముఖ్యమైన ప్రోటీన్‌ను నిరోధించగలదని మేము చూపించగలిగాము" అని సావో పాలో విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ మరియు అధ్యయన రచయిత రాఫెల్ గైడో అన్నారు.

ఈ విషయంలో ఉండే  PLPro అనే అణువు వైరస్ పునరుత్పత్తికి కణాలను దెబ్బతీయడానికి సహాయం చేస్తుందట. ఇది ప్రయోగాత్మకంగా నిరూపితమైందని నిపుణులు చెబుతున్నారు. దీనికోసం.. పాములను పెంచాల్సిన అవసరం ఉదందని వారు చెబుతున్నారు.  కాగా.. దీనిపై మరిన్ని ప్రయోగాలు చేయాల్సి ఉందని వారు చెబుతున్నారు. 
 

click me!