కరోనా వేరియంట్లకు ఇలాంటి పేర్లు ఎందుకు పెడతారో తెలుసా..?

By telugu news teamFirst Published Jun 15, 2021, 2:21 PM IST
Highlights

దానిలో కొత్త రకం వేరియంట్లు ప్రజలను ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాయి. దీంతో.. ఒక్కో రకం కరోనా వేరియంట్ కి ఒక్కో పేరు పెట్టడం మొదలుపెట్టారు

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసేసిన సంగతి తెలిసిందే. తొలుత  ఈ వైరస్ కి కరోనా అని నామకరణం చేశారు. తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ దానిని కోవిడ్-19గా పేర్కొంది. అయితే.. ఆ తర్వాత ఈ వైరస్ చాలా రూపాంతరాలు చెందింది. దానిలో కొత్త రకం వేరియంట్లు ప్రజలను ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాయి. దీంతో.. ఒక్కో రకం కరోనా వేరియంట్ కి ఒక్కో పేరు పెట్టడం మొదలుపెట్టారు.  అయితే.. ఆ పేర్లు  బి.1.351, బి.1.617.2 ఇలా ఉండటంతో.. చాలా గందరగోళంగా ఉంది.

అయితే.. అసలు ఈ కరోనా వేరియంట్లకు ఇలాంటి పేర్లు పెట్టడం వెనక కారణం ఉందంట. అదేంటో తెలుసుకుందాం.. తొలుత కరోనా వేరియంట్లకు ప్రపంచ ఆరోగ్య సంస్థ  సింపుల్‌గా వీ1, వీ2, వీ3.. ఇలా పేర్లు పెట్టాలని అనుకుందట. కానీ ఆ తర్వాత ఈ నిర్ణయాన్ని మార్చుకొని ఆల్ఫా, బీటా, డెల్టా వంటి పేర్లు పెట్టింది. బి.1.351 ఇది సౌతాఫ్రికాలో తొలిసారి బయటపడిన వేరియంట్.  ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న ప్రమాదకర వేరియంట్లలో ఇదీ ఒకటి. ఈ క్రమంలో అమెరికాలో బి.1.315 అనే వేరియంట్ విజృంభిస్తోందని వార్తలు వచ్చాయి. 
చాలా మంది ఈ రెండు వేరియంట్ల విషయంలో తికమకపడ్డారు. దీంతో సౌతాఫ్రికాలో బయటపడిన వేరియంట్‌ను ‘సౌతాఫ్రికా వేరియంట్’ అనడం ప్రారంభించారు. కానీ ఇది ఈ దేశంలో పుట్టిందనడానికి ఆధారాల్లేవు. అలాగే ఇది ఇప్పుడు 48 దేశాల్లో బయటపడింది. అలాంటప్పుడు దీన్ని సౌతాఫ్రికా వేరియంట్ అని ఎలా అంటారు? అని కొందరు ప్రశ్నించారు.

 అసలు ఈ ‘బి.1’ అంటే ఏంటో తెలుసా? ఒక వేరియంట్ పేరు ఇలా మొదలైందంటే.. ఇది ఇటలీలో విజృంభించిన కరోనా వేరియంట్ తాలూకా అని. నేరుగా చైనా నుంచి వచ్చిన వైరస్ కాదన్నమాట. ఇటలీలో విలయంలో ఈ కొత్త వేరియంట్ల మూలాలు దాక్కొని ఉన్నాయని ఈ ‘బి.1’ చెప్తుంది.

 ఇలా ఒక రకం మ్యూటేషన్ల సంఖ్య భారీగా పెరిగిపోయినా, మరో అంకె లేదంటే డాట్‌ పెట్టడం కష్టమని భావించినా సైంటిస్టులు మరో అక్షరంతో కొత్త సిరీసును ప్రారంభిస్తారు. ఇలా ఇంగ్లీషు అక్షరమాలను కూడా శాస్త్రవేత్తలు వేరియంట్లకు పేర్టు పెట్టడంలో ఉపయోగించుకుంటారు.  అయితే సామాన్యులకు ఇలాంటి పేర్లు గుర్తుపెట్టుకోవడం పెద్ద తలనొప్పి వ్యవహారంలా తోస్తుంది.

click me!