ఎండాకాలంలో కొబ్బరి నీళ్లను ఖచ్చితంగా తాగండి.. లేదంటే ఈ లాభాలను మిస్ అయిపోతారు మరి

By Mahesh RajamoniFirst Published Apr 2, 2023, 2:17 PM IST
Highlights

కొబ్బరి నీళ్లలో కేలరీలు తక్కువగా ఉంటాయి. దీనిలో మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ నీళ్లను తాగితే జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. అలసట నుంచి ఉపశమనం పొందుతారు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

ఎండాకాలంలో దాహం తీర్చుకోవడానికి చాలా మంది ఎంచుకునే పానీయాలలో కొబ్బరి నీళ్లు ఒకటి. కొబ్బరి నీళ్లలో ఎన్నో ఔషదగుణాలు ఉంటాయి. ఈ కొబ్బరి నీరు అద్భుతమైన ఎనర్జీ డ్రింక్ గా ప్రసిద్ధి చెందింది. ఈ నేచురల్ సాఫ్ట్ డ్రింక్ ఆరోగ్యానికి చాలా మంచిది. కొబ్బరి నీళ్లలో పొటాషియం, మాంగనీస్, విటమిన్ సి, కాల్షియం, ఫైబర్స్ పుష్కలంగా ఉంటాయి. కొబ్బరి నీరు మన శరీరాన్ని, మనస్సును ఆరోగ్యంగా ఉంచుతాయి. ఎండాకాలంలో కొబ్బరి నీళ్లను తాగితే శరీరం చల్లగా ఉంటుంది. 

ఎండాకాలంలో డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉండటానికి కొబ్బరి నీరు ఎంతో సహాయపడుతుంది. దీనిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. దీనిలో నేచురల్ ఎంజైమ్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ డ్రింక్ లో జీర్ణవ్యవస్థను ఉత్తేజపరిచే గుణాలు ఉంటాయి. ఇవి అలసట నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. కొబ్బరి నీరు తీయగా ఉన్నప్పటికీ.. దీనిలో చక్కెర కంటెంట్ తక్కువగా ఉంటుంది. 100 మిల్లీలీటర్ల కొబ్బరి నీళ్లలో 5 శాతం చక్కెర కంటెంట్ ఉంటుంది. గ్లూకోజ్, ఫ్రక్టోజ్ దాదాపు సమాన మొత్తంలో ఉంటాయి. కొబ్బరి నీళ్లలో కొలెస్ట్రాల్ అస్సలు ఉండదు. కొబ్బరి నీటిలో ఫ్యాట్ మొత్తమే ఉండదు. 

ఊబకాయాన్ని తగ్గించుకోవాలనుకునే వారికి ఇదొక ఒక గొప్ప పానీయం. భోజనానికి ముందు ఒక గ్లాసు కొబ్బరి నీళ్లను తాగడం వల్ల మీరు అతిగా తినే అవకాశం ఉండదు. దీన్ని తాగితే తక్షణమే ఎనర్జీ వస్తుంది. కొబ్బరి నీటిని రోజూ తాగడం మంచిదని పోషకాహార నిపుణులు కూడా చెబుతున్నారు. కఠినమైన పని, వ్యాయామాల తర్వాత కొబ్బరి నీళ్లను తాగడం చాలా మంచిది.

కొబ్బరి నీరు జీర్ణ సహాయకారిగా కూడా పని చేస్తుంది. పడుకునే ముందు కొబ్బరి నీళ్లను తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు పోతాయి. ఉదయాన్నే పరగడుపున కొబ్బరి నీళ్లను తాగడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. రక్తపోటు స్థాయిలను తగ్గించడానికి కూడా కొబ్బరి నీరు ఎంతో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాల భాండాగారం అయిన కొబ్బరి నీరు గర్భిణీ స్త్రీలు కూడా తాగొచ్చు. కొబ్బరి నీళ్లను తాగడం వల్ల చర్మ ఆరోగ్యానికి కూడా మంచి జరుగుతుంది. ఇది చర్మాన్ని తేమగా, ప్రకాశవంతంగా ఉంచడానికి సహాయపడుతుంది.

click me!