గర్బిణులు పెసర్లను తింటే ఎన్ని లాభాలున్నాయో తెలుసా?

Published : Apr 02, 2023, 07:15 AM IST
గర్బిణులు పెసర్లను తింటే ఎన్ని లాభాలున్నాయో తెలుసా?

సారాంశం

పెసరపప్పులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని గర్బిణులు తింటే ఎంతో మంచి జరుగుతుంది. ఈ మూంగ్ దాల్ లో ఎక్కువ మొత్తంలో ప్రోటీన్లు, ఇనుము, ముఖ్యమైన ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.

ముంగ్ బీన్స్ అని కూడా పిలువబడే పెసర పప్పు ఒక ప్రసిద్ధ పప్పు దినుసులు. వీటిని ఎన్నో ఏళ్లుగా భారతీయ వంటకాల్లో ఉపయోగిస్తున్నారు. ఈ పోషకాహారం గర్భిణులకు ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ప్రోటీన్, ఇనుము, అవసరమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. మొలకెత్తిన పెసరపప్పు నుంచి పెసర పప్పు సూప్, కిచిడీ వరకు గర్భధారణ సమయంలో ఈ సూపర్ ఫుడ్ ను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. ప్రెగ్నెన్సీ సమయంలో పెసర్లను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలను పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం..  

ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది

పెసరపప్పు ప్రోటీన్ కు అద్భుతమైన మూలం. ఇది పిండం పెరుగుదల, అభివృద్ధికి చాలా చాలా అవసరం. తల్లి శరీరంలో కొత్త కణాలు, కణజాలాలు ఏర్పడటానికి ప్రోటీన్ సహాయపడుతుంది.

ఐరన్ సమృద్ధిగా ఉంటుంది

ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అవసరమైన ఐరన్ పెసరపప్పులో పుష్కలంగా ఉంటుంది. గర్భధారణ సమయంలో ఇనుము లోపం రక్తహీనతకు దారితీస్తుంది. దీనివల్ల అలసట, బలహీనతతో పాటుగా ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. 

కొవ్వు తక్కువగా ఉంటుంది

పెసరపప్పులో కొవ్వు తక్కువగా ఉంటుంది. పెసర పప్పు ఫైబర్ అద్భుతమైన మూలం. ఇది ప్రేగు కదలికలను నియంత్రించడానికి, గర్భధారణ సమయంలో మలబద్దకాన్ని నివారించడానికి సహాయపడుతుంది.

అవసరమైన విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి

పెసరపప్పు ఫోలేట్, పొటాషియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాల మంచి మూలం. శిశువు నాడీ వ్యవస్థ అభివృద్ధికి ఫోలేట్ ఎంతో అవసరం. పెసరపప్పుల్లో ఉండే పొటాషియం, మెగ్నీషియం రక్తపోటును నియంత్రించడానికి, ఎముకలను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి. 

గర్భిణులు పెసరపప్పును ఎలా తినాలి?

మొలకెత్తిన పెసరపప్పు

మొలకెత్తిన పెసర పప్పు గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యకరమైనది. దీనిలో ప్రోటీన్, ఐరన్, ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. సలాడ్లు, శాండ్విచ్లు లేదా స్టిర్-ఫ్రైలకు మొలకెత్తిన పెసరపప్పును జోడించొచ్చు.

పెసర పప్పు సూప్

గర్భిణులు పెసరపప్పు సూప్ ను కూడా తీసుకోవచ్చు. దీన్ని తయారు చేయడం చాలా సులువు. అందులోనూ దీన్ని మీకు నచ్చినట్టుగా తయారుచేయొచ్చు. అదనపు పోషణ కోసం క్యారెట్లు, బచ్చలికూర లేదా టమోటాలు వంటి కూరగాయల సూప్ లో వీటిని చేర్చొచ్చు. 

పెసర పప్పు కిచిడీ

పెసర పప్పు కిచిడీ సాంప్రదాయ భారతీయ వంటకం. ఇది సులభంగా జీర్ణమవుతుంది. ఈ కిచిడీలో ప్రోటీన్,  ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. అదనపు పోషణ కోసం ఈ కిచిడీలో బఠానీలు, క్యారెట్లు లేదా బంగాళాదుంపలు వంటి కూరగాయలను వేయొచ్చు. 

పెసర పప్పు సలాడ్

పెసరపప్పు సలాడ్ గర్భిణులకు ఆరోగ్యకరంగా ఉంటుంది. అదనపు పోషణ కోసం మీరు దోసకాయ, టమోటా లేదా క్యారెట్ వంటి కూరగాయలను సలాడ్ లో వేయొచ్చు. 

PREV
click me!

Recommended Stories

Mineral Water: మినరల్ వాటర్‌ను వేడిచేసి తాగడం మంచిదా? కాదా? తాగితే ఏమవుతుంది?
Lifestyle: ఎక్కువ కాలం బ‌త‌కాల‌ని ఉందా.? రోజూ ఈ 4 ప‌నులు చేయండి చాలు