ఎండాకాలంలో రాగులను తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో..!

Published : Apr 02, 2023, 10:17 AM IST
ఎండాకాలంలో రాగులను తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో..!

సారాంశం

రాగులతో బోలెడు లాభాలున్నాయి. ముఖ్యంగా, గర్భిణులు, మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఈ చిరుధాన్యాలు ఎంతో మేలు చేస్తాయి. వీటిని ఎండాకాలంలో తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.   


రాగుల్లో ఎన్నో ఔషదగుణాలు దాగున్నాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్లకు మంచి వనరు. అంతేకాదు దీనిలో పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇది శోథ నిరోధక భోజనం కూడా. రాగులు డయాబెటీస్ రోగులకు ఎంతో మేలు చేస్తుంది. ఎందుకంటే ఇవి గ్లూకోజ్ ను నియంత్రణలో ఉంచుతుంది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఇటీవల తన అధికారిక పేజీలో రాగుల్లో ఉన్న పోషక ప్రయోజనాలను హైలైట్ చేస్తూ ఒక ట్వీట్ చేసింది. రాగులు చాలా పోషకమైనది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతాయి. ముఖ్యంగా దెబ్బతిన్న కండరాల కణజాలాలను నయం చేస్తాయి. దీనిలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉండటం వంటి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉందని పోస్ట్ లో ఉంది. 

రాగులను మన రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఎందుకంటే రాగులతో రొట్టెలు, రాగి జావా, బిస్కెట్లు అంటూ వీటిని వివిధ మార్గాల్లో తినొచ్చు. వీటన్నింటినీ రాగి పిండితో తయారు చేయొచ్చు. రాగులు, ఖర్జూలతో లడ్డూలు, రాగి-కోకో కేకులు బలే టేస్టీగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. అసలు రాగులను ఎండాకాలంలో ఖచ్చితంగా ఎందుకు తినాలంటే..?

ఒక గ్లాసు పాలతో సమానమైన కాల్షియం రాగుల్లో ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజుకు రెండు రాగుల రొట్టెను తింటే మన శరీరానికి సరిపడా కాల్షియం అంది ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. రాగుల్లో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇది మంటను తగ్గించడానికి, గ్లూకోజ్ నిర్వహణను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.

ఎండాకాలంలో చాలా మంది  "రాగి కూజ్" అని పిలువబడే పానీయాన్ని ఎక్కువగా తాగుతారు.  కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వంటి ప్రాంతాలలో పులియబెట్టిన రాగుల నుంచి కూలింగ్ డ్రింక్ ను తయారుచేసి తాగుతారు. ఇది కడుపును శాంతపరుస్తుంది. అలాగే తక్షణ శక్తిని అందిస్తుంది

ఆయుర్వేదం ప్రకారం.. రాగులు మన  శరీరానికి హాని చేసే ట్యాక్సిన్స్ ను తగ్గిస్తాయి. అంతేకాదు శరీరంలో కొలెస్ట్రాల్ నియంత్రణకు కూడా ఇది సహాయపడుతుంది. అల్పాహారంలో రాగి ఫ్లేక్స్, రాగి పిండి చపాతీలను తింటే మీ శరీరానికి ఫైబర్ కంటెంట్ బాగా అందుతుంది. ఇది మీరు ఆరోగ్యంగా బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. ఎందుకంటే ఫైబర్ కంటెంట్ మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతతుంది. అలాగే రాగిపిండి పేస్ట్ ను పాలతో కలిపి ముఖానికి అప్లై చేయడం వల్ల ముడతలు తొలగిపోతాయి. దీనిలో ఉండే కొల్లాజెన్, యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్య లక్షణాలను నివారిస్తాయని నిపుణులు అంటున్నారు.

PREV
click me!

Recommended Stories

ఉదయమా లేదా రాత్రా..? చల్లని బీర్ తాగడానికి మంచి సమయం ఏది?
ఉసిరిని రెగ్యులర్ గా తీసుకుంటే కలిగే లాభాలు ఇవే!