ఈ ఆయుర్వేద చిట్కాలతో కూడా మీరు ఫాస్ట్ గా బరువు తగ్గొచ్చు తెలుసా?

Published : Mar 09, 2023, 03:11 PM IST
ఈ ఆయుర్వేద చిట్కాలతో కూడా మీరు ఫాస్ట్ గా బరువు తగ్గొచ్చు తెలుసా?

సారాంశం

ఆయుర్వేద చిట్కాలు కూడా మీరు సులువుగా, ఫాస్ట్ గా బరువు తగ్గేందుకు సహాయపడతాయి. ఇవి మీ జీవక్రియను వేగవంతం చేయడానికి, మీ శరీరాన్ని నిర్విశీకరణ చేయడానికి, కొవ్వును సహజంగా కరిగించడానికి సహాయపడతాయి. 

మనలో చాలా మంది బరువు తగ్గడానికి చాలా కష్టపడిపోతుంటారు. అది కూడా ఆరోగ్యకరమైన మార్గంలో.  కానీ వ్యాయామం చేస్తూ హెల్తీ ఫుడ్స్ ను మాత్రం తక్కువగా తింటారు. అలాగే ఆరోగ్యాన్ని పాడే చేసే డైటింగ్ లను ఫాలో అవుతుంటారు. బరువు తగ్గడం అనేది ఆరోగ్యకరమైనదిగా, క్రమంగా, స్థిరమైన పద్ధతిలో జరగాల్సిన విషయం. అయితే మీరు ఆరోగ్యకరమైన పద్ధతిలో బరువు తగ్గడానికి కొన్ని ఆయుర్వేద పద్దతులు కూడా సహాయపడతాయి. 

బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కేలరీల పరిమితి పరిగణించడం మాత్రమే కాదు సమతుల్య జీవనశైలి, ఒత్తిడి నిర్వహణ, ఆరోగ్యకరమైన ఆహారం వంటివి కూడా ముఖ్యమేనంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఆయుర్వేద చిట్కాలను అవలంబిస్తూ ఆరోగ్యంగా ఎలా బరువు తగ్గాలో ఇప్పుడు తెలుసుకుందాం..

బరువు తగ్గడానికి ఆయుర్వేదం ఎలా సహాయపడుతుంది?

ఆయుర్వేదం సహజ మూలికా మందులతో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. ఆయుర్వేదం కొవ్వు తక్కువగా, పోషకాలు ఎక్కువగా ఉండే  స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన ఆహారాలను తినాలని చెబుతుంది. ఆయుర్వేద మందులతో మీ జీవక్రియను వేగవంతం చేయొచ్చు, మీ శరీరాన్ని నిర్విషీకరణ చేయొచ్చు. అలాగే ఎక్కువ కొవ్వును వేగంగా కరిగించొచ్చు.

భారీ భోజనం 

ఆయుర్వేదం రాత్రి భోజనం కంటే మధ్యాహ్న భోజనాన్నే ఎక్కువగా తినాలని సూచిస్తోంది. మీ రోజువారీ కేలరీలను తీసుకోవడానికి మధ్యాహ్నం కేలరీల ఫుడ్ ను ఎక్కువగా తినాలని చెబుతోంది. ఈ సమయంలో మీ శరీరానికి పోషకాలను జీర్ణం చేయడానికి, వాటిని గ్రహించడానికి తగినంత సమయం ఉంటుంది. ఉబ్బరం లేదా అజీర్థి ప్రమాదం తగ్గుతుంది. కానీ రాత్రిపూట సాధ్యమైనంత తక్కువ కేలరీలనే తీసుకోవాలి. మీ భోజనంలో ప్రోటీన్, కొవ్వు, కార్బోహైడ్రేట్లు అనే మూడు అవసరమైన పోషకాలను చేర్చాలి. సలాడ్, పప్పు, అన్నం, కూరను తినొచ్చు. కొంచెం నెయ్యి, పెరుగుతో మీ మధ్యాహ్న భోజనాన్ని కంప్లీట్ చేయొచ్చు. 

ఇంట్లో వండిన ఆహారాన్నే తినండి

బరువు తగ్గడమే మీ లక్ష్యమైతే.. మీరు ఇంట్లో వండిన భోజనాన్ని మాత్రమే తినండి. రెస్టారెంట్లు, ప్యాకేజీల ఫుడ్స్ ను అస్సలు తినకండి. ఎందుకంటే వీటిలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో వండిన ఆహారంలో కొవ్వు తక్కువగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటుంది. కూరగాయలు, పప్పుధాన్యాలు, తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మాంసాహారం ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే ఇవి గుండెను రిస్క్ లో పడేస్తాయి. 

తిన్న తర్వాత యోగా లేదా నడక 

శారీరకంగా చురుకుగా ఉంచుకుంటే మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంచుకోగలుగుతారు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తింటే సరిపోదు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడంతో పాటుగా వ్యాయామం కూడా చేయాలి. ప్రతిరోజూ తిన్న తర్వాత కనీసం 15 నిమిషాలు నడవడానికి లేదా యోగా చేయడానికి ప్రయత్నించండి.

గోరువెచ్చని నీరు

బరువు తగ్గడానికి రోజంతా 2-3 లీటర్ల గోరువెచ్చని నీటిని తాగాలని ఆయుర్వేద నిపుణులు సలహానిస్తున్నారు. శరీర కొవ్వును కరిగించడానికి గోరువెచ్చని నీరు బాగా సహాయపడుతుంది. ఈ వార్మ్ వాటర్ శరీరంలో కొవ్వును విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది. ఒక గ్లాసు చల్లని నీరే కాదు గోరువెచ్చని నీరు కూడా జీవక్రియను పెంచుతుంది. మిమ్మల్ని మరింత హైడ్రేట్ గా ఉంచుతుంది. భోజనానికి 30 నిమిషాల ముందు గోరు వెచ్చని నీటిని తాగితే ఆకలి కంట్రోల్ లో ఉంటుంది. కేలరీల వినియోగం కూడా  నియంత్రణలో ఉంటుంది.

మూలికా మిశ్రమం

మూలికా మిశ్రమం ద్రవం కొవ్వు బర్నింగ్ ను వేగవంతం చేస్తుంది. వేయించిన మెంతులను ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాసు గోరువెచ్చని నీటితో తినాలి. మెంతుల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. మలబద్దకాన్ని తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నప్పుడు త్రిఫలాన్ని కూడా తీసుకోవచ్చు. మూడు ఆయుర్వేద మూలికల కలయిక జీవక్రియను పెంచుతుంది. శరీరంలోని మలినాలను బయటకు పంపడానికి కూడా సహాయపడుతుంది. 
 

PREV
click me!

Recommended Stories

Weight Loss Tips : నోరు కట్టుకుని, కడుపు మాడ్చుకోవాల్సిన పనిలేదు.. ఆడుతూ పాడుతూ హాయిగా బరువు తగ్గండి
ఉదయమా లేక రాత్రా..? చల్లని బీర్ తాగడానికి మంచి సమయం ఏది?