ఈ ఎండాకాలం ఫుడ్స్ మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.. తప్పక తినండి

Published : Mar 09, 2023, 01:34 PM IST
ఈ ఎండాకాలం ఫుడ్స్ మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.. తప్పక తినండి

సారాంశం

ఈ రోజుల్లో చిన్న చిన్న పిల్లలు కూడా గుండెపోటుతో చనిపోతున్నారు. గుండె జబ్బుల బారిన పడుతున్నారు. అయితే కొన్ని ఎండాకాలం ఆహారాలతో కూడా మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. 

ఎక్కువ ఉష్ణోగ్రతలు, ఎక్కువ శారీరక ఒత్తిడి వల్ల మన ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. ఇది గుండె ఎక్కువ రక్తాన్ని పంప్ చేయడానికి కారణమవుతుంది. ఇది వేసవికాలం గుండెపోటును ఎక్కువగా చేస్తుంది. అందుకే మన గుండె ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ తీసుకోవాలి. ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం, మెగ్నీషియం ఎక్కువగా ఉన్న ఆహారాలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఆరోగ్యకరమైన గుండె కోసం ఎలాంటి ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..

కొబ్బరి నీరు

కొబ్బరి నీళ్లు తాగడానికి వేసవి సరైన సమయం. దీనిలో ఉండే చలువచేసే లక్షణాలు వేడి వాతావరణాన్ని ఎదుర్కోవటానికి బాగా సహాయపడతాయి. అందులోనూ ప్రతి పండ్ల షాపుల్లో కొబ్బరి నీళ్లు సులువుగా లభిస్తాయి. ఇది చవకైనది మాత్రమే కాదు.. దీనిలో విటమిన్లు, ఖనిజాలు, ఇతర పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. కొబ్బరి నీళ్లను క్రమం తప్పకుండా తాగడం వల్ల కూడా క్యాన్సర్ ను నివారించొచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.

బొప్పాయి

బొప్పాయి శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి, గుండె, రక్త నాళాల ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడుతుందని ఇటీవలి పరిశోధనలో తేలింది. దీనిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, అలాగే పాపైన్ అనే సమ్మేళనం కూడా ఉంటుంది. ఇది  చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.

పుచ్చకాయ

పుచ్చకాయలు వేసవిలో పుష్కలంగా లభిస్తాయి. ఈ సీజన్ లో ఎక్కువగా తినే పండ్లలో ఇది ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. ఈ పండులో 92 శాతం నీరు ఉంటుంది. అలాగే దీనిలో రక్తపోటును తగ్గించే ఇతర ముఖ్యమైన పోషకాలు కూడా ఉంటాయి. దీనిలో ఉండే వాటర్ కంటెంట్ మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. గుండెపై ఒత్తిడిని తగ్గిస్తుంది.

ఆకుపచ్చ ఆకు కూరలు

ఆకు కూరలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఆకుకూరల్లో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ కూరగాయలను అతిగా వండకుండా ఉండాలి. ఎందుకంటే అతిగా వండడం వల్ల వీటిలోని నీటి కంటెంట్ కోల్పోతుంది. 

దోసకాయ

కీరదోసకాయను ఎండాకాలంలో తినడం వల్ల గుండెకు ఎంతో మేలు జరుగుతుంది. ఎందుకంటే దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. నీరు కూడా  పుష్కలంగా ఉంటుంది.

సెలెరీ

దీనిలో సోడియం, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్, జింక్ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి వేడి వాతావరణంలో హృదయనాళ వ్యవస్థకు ప్రయోజనకరంగా ఉంటాయి.   

PREV
click me!

Recommended Stories

Weight Loss Tips : నోరు కట్టుకుని, కడుపు మాడ్చుకోవాల్సిన పనిలేదు.. ఆడుతూ పాడుతూ హాయిగా బరువు తగ్గండి
ఉదయమా లేక రాత్రా..? చల్లని బీర్ తాగడానికి మంచి సమయం ఏది?