చంద్రబాబు, నారా లోకేష్ లు ఇద్దరూ గత ఐదేళ్లు సంపాదనే ధ్యేయంగా అవినీతి ప్రభుత్వాన్ని నడిపారని ఆరోపించారు. ప్రజాధనాన్ని వైసీపీ ప్రభుత్వం ఆదా చేస్తుంటే దాన్ని చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు.
తాడేపల్లి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. అధికారం లేకపోవడంతో చంద్రబాబు నాయుడు ఏవేవో మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం గత తెలుగుదేశం ప్రభుత్వం అవినీతిని బట్టబయలు చేస్తుండటంతో చంద్రబాబు, నారా లోకేష్ వెన్నులో వణుకుపుడుతోందని ఆరోపించారు.
మద్యాన్ని నియంత్రించాలనే సదుద్దేశంతోనే ప్రభుత్వమే మద్యాన్ని అమ్ముతోందని దాన్ని కూడా రాద్ధాంతం చేయడం సిగ్గుచేటని విమర్శించారు అంబటి రాంబాబు. బెల్ట్ షాపులు రద్దు చేసిన ఘనత వైయస్ జగన్ ప్రభుత్వానిదేనని చెప్పుకొచ్చారు. బెల్ట్ షాపులను రద్దు చేసిందకు మెచ్చుకోవాల్సిన చంద్రబాబు విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు.
చంద్రబాబు, నారా లోకేష్ లు ఇద్దరూ గత ఐదేళ్లు సంపాదనే ధ్యేయంగా అవినీతి ప్రభుత్వాన్ని నడిపారని ఆరోపించారు. ప్రజాధనాన్ని వైసీపీ ప్రభుత్వం ఆదా చేస్తుంటే దాన్ని చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు.
వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు నాయుడు విషప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా తండ్రీ కొడుకులిద్దరూ తమ ఆక్రోశాన్ని వెల్లగక్కుతున్నారంటూ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విరుచుకుపడ్డారు.
తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందని తాము అధికారంలోకి వస్తే అవినీతి రహిత పాలనను అందించడంతోపాటు అవినీతిని బహిర్గతం చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చామని చెప్పుకొచ్చారు.
అందులో భాగంగానే అవినీతిని బయటకు తీస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అధికారం లేకపోయేసరికి చంద్రబాబు నాయుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంపై లేనిపోని అభాండాలు వేస్తున్నారంటూ అంబటి రాంబాబు మండిపడ్డారు.
అవినీతి రహిత పాలనను అందించే పనిలో భాగంగా రివర్స్ టెండరింగ్ వంటి కీలక నిర్ణయాలను తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. రివర్స్ టెండరింగ్ మంచి ఫలితాలను ఇస్తోందని చెప్పుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టులోనే రూ.780 కోట్లు ప్రజాధనం ఆదా అయ్యిందంటే ఎంత సక్సెస్ అయ్యిందో ఇట్టే తెలుస్తోందన్నారు.
పోలవరం రివర్స్ టెండరింగ్ లో చంద్రబాబు నాయుడు అవినీతి బట్టబయలైందని స్పష్టం చేశారు. పీపీఏల పున:సమీక్షలపై లేనిపోని గగ్గోలు పెడుతున్నారంటూ ధ్వజమెత్తారు అంబటి రాంబాబు. త్వరలో మరింత అవినీతి బయటకు వస్తోందని తెలిపారు.
మరోవైపు గోదావరిలో బోటు వెలికి తీయకపోవడానికి ప్రభుత్వానికి సంబంధం ఏంటని నిలదీశారు. బోటు వెలికితీసేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని తెలిపారు. అయితే బోటు వెలికి తీసేందుకు గోదావరి అనుకూలంగా లేదని చెప్పుకొచ్చారు.
ఇకపోతే రైతు రుణమాఫీ సాధ్యం కాదని గతంలోనే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారని చెప్పుకొచ్చారు. అలాంటిది చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలను తాము అమలు చేయడమేంటని ప్రశ్నించారు. తాము రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నామని అలాంటప్పుడు రుణమాఫీ ఎందుకు చేస్తామని తెలిపారు.
వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ వై సుజనాచౌదరి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. సుజనా చౌదరి బీజేపీలో చేరారన్న విషయం మరచిపోయినట్లు ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. ఇంకా తెలుగుదేశం పార్టీ సభ్యుడిగానే సుజనాచౌదరి మాట్లాడుతున్నారంటూ అంబటి రాంబాబు మండిపడ్డారు.
ఈ వార్తలు కూడా చదవండి
పీపీఏలపై కేంద్రం సీరియస్: జగన్ కు కేంద్రమంత్రి ఆర్కే సింగ్ లేఖ
రివర్స్ టెండరింగ్, పీపీఏలపై సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు
పిపిఎల సమీక్షపై విద్యుత్ సంస్థలకు హైకోర్టు షాక్
పీపీఏలపై తప్పుడు ప్రచారం, మేం చెప్పినా వినడం లేదు: జగన్ పై కేంద్రమంత్రి ఆగ్రహం
జగన్ ప్రభుత్వానికి కేంద్రం షాక్
విదేశీ బ్యాంకుల షాక్: పిపిఎల రద్దుపై వెనక్కి తగ్గిన జగన్ సర్కార్
వైఎస్ జగన్ కు జపాన్ కరెంట్ షాక్
పీపీఏల వల్ల రాష్ట్రానికి లాభం లేదు.. అందుకే రద్దు చేశాం: జగన్
జగన్ సర్కార్ కు తలనొప్పిగా పీపీఏల అంశం: హైకోర్టులో మరో రెండు పిటీషన్లు
మోదీ ప్రభుత్వంతో సమరానికి జగన్ సై : అగ్గిరాజేస్తున్న పీపీఏ అంశం
సోలార్, విండ్ కంపెనీల నుంచి విద్యుత్ నిలిపివేత: సీఎం జగన్ సంచలన నిర్ణయం
హైకోర్టులో జగన్ సర్కార్ కు చుక్కెదురు: పీపీఏల పున:సమీక్షకు బ్రేక్
జగన్ సర్కార్ కు అప్పిలేట్ ట్రిబ్యునల్ షాక్