అమరావతి నుంచి హైకోర్టును తరలించవద్దంటూ న్యాయవాదులు ఆందోళనకు దిగారు. గుంటూరు జిల్లా బార్ అసోషియేషన్ తోపాటు ఐదు జిల్లాల న్యాయవాదులు అమరావతిలో నిరసనకు దిగారు.
అమరావతి: హైకోర్టు తరలింపు అంశం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అమరావతి నుంచి హైకోర్టును రాయలసీమకు తరలిస్తున్నారంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీలో కొత్త ఉద్యమం ఊపందుకుంది.
అమరావతి నుంచి హైకోర్టును తరలించవద్దంటూ న్యాయవాదులు ఆందోళనకు దిగారు. గుంటూరు జిల్లా బార్ అసోషియేషన్ తోపాటు ఐదు జిల్లాల న్యాయవాదులు అమరావతిలో నిరసనకు దిగారు. హైకోర్టును అమరావతిలోనే ఉంచాలని డిమాండ్ చేశారు.
హైకోర్టును తరలిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇదిలా ఉంటే రాయలసీమలో రాయలసీమ న్యాయవాదులు సైతం ఆందోళన బాట పట్టారు. రాష్ట్రం కోసం రాజధానిని త్యాగం చేశామని గతంలో హైకోర్టు బెంచ్ కూడా కోరామని ఇప్పుడైనా రాయలసీమలో హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
దీంతో హైకోర్టుపై ఏపీ వ్యాప్తంగా ఉద్యమం మెుదలైనట్లు అయ్యింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే కర్నూలు జిల్లా తీవ్రంగా నష్టపోయిందని ఈ సారైనా న్యాయం జరగకపోతే సహించేది లేదని సీమ న్యాయవాదులు తెగేసి చెప్తున్నారు.