చంద్రబాబు జైలుకే... ఆ రాష్ట్రాల ఎన్నికల్లోనూ ఆయన అక్రమ సంపాదనే...: రామచంద్రయ్య

By Arun Kumar PFirst Published Feb 13, 2020, 4:18 PM IST
Highlights

మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబుపై వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు సి రామచంద్రయ్య విరుచుకుపడ్డారు. 

గుంటూరు: గత టిడిపి పాలనలో, ముఖ్యమంత్రి చంద్రబాబులో నిజాయితీ లేదని గుర్తించడంవల్లే ప్రజలు తిరస్కరించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సి రామచంద్రయ్య  ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చైతన్య వంతులు కాబట్టే బాబును పక్కన పెట్టారని అన్నారు. అయినా ఆయనలో మార్పు రాలేదని... ఇప్పుడు కూడా తన వైఫల్యాలను ప్రజల వైపు నెడుతున్నారని మండిపడ్డారు. 

ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర సమస్యల పరిష్కారం, ఆర్థిక సాయం తదితర అంశాలపై ప్రధాని మోదీతో చర్చించేందుకు డిల్లీకి వెళ్లారన్నారు. పలు అంశాలపై ప్రధానమంత్రితో సుధీర్ఘంగా చర్చించారని... స్వయంగా ఆయనే జగన్ ను అడిగి రాష్ట్ర పరిస్థితి  గురించి తెలుసుకున్నారని అన్నారు. 

read more  డిల్లీలో బిజెపి ఘోర పరాజయానికి కారణం జగనే...ఎలాగంటే..: బుద్దా వెంకన్న

కానీ టీడీపీ  నాయకులు, పచ్చ మీడియా ప్రధానితో జగన్ భేటీపై విష ప్రచారం చేస్తోందన్నారు. గంటన్నర పాటు రాష్ట్ర సమస్యలపై జగన్ తో ప్రధాని మంచి వాతావరణంలో చర్చిస్తే... అనుమానాలు రేకెత్తించే విధంగా వార్తలు రాయడం, వాటిని పట్టుకుని తెలుగుదేశం నేతలు మాట్లాడటం తగదన్నారు. 

రాష్ట్రంలోని కియా కార్ల పరిశ్రమను తరలిస్తున్నారని ప్రతిపక్షాలు కట్టుకథలు చెబుతున్నారని అన్నారు. ఇలాంటి నీచ రాజకీయాలతో ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని... ఇలాంటివి తప్ప ఆయనకు మరో పని లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోకి పెట్టుబడులు వస్తూనే ఉన్నాయి తప్ప వెనక్కి వెళ్ళటం లేదన్నారు. 

రాష్ట్రవ్యాప్తంగా చైతన్య యాత్ర చేస్తానని బాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలు ఎన్నికల సందర్భాల్లో తప్పు చేస్తారంటూ చంద్రబాబు రాష్ట్రంలోని యావత్ ప్రజానికాన్ని అవమానించేలా మాట్లాడటం సిగ్గు చేటన్నారు. 

read more  అమరావతి దీక్షా శిబిరంలో ఉద్రిక్తత... మద్యం బాటిల్ తో దాడి

పని చేసే ప్రభుత్వాలకు ప్రజలు పట్టం కడతారనడానికి డిల్లీ ఎన్నికలే నిదర్శనని రామచంద్రయ్య పేర్కొన్నారు. గడచిన ఎన్నికల్లో కొన్ని రాష్ట్రాలకు అవినీతి సంపాదనను బదలాయించిన చంద్రబాబును తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. 

చంద్రబాబు మనుషులపై ఇటీవల జరిగిన ఐటీ దాడుల్లో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని... ఆధారాలతో సహ దోరికినందువల్లే వాటిపై చంద్రబాబు మాట్లాడలేక పోతున్నారని అన్నారు. చంద్రబాబు ప్రజా విద్రోహ కార్యక్రమాలు బట్టబయలై జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై కేంద్ర సంస్థలు దృష్టి సాధించాలని రామచంద్రయ్య సూచించారు. 
 

click me!