అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని కోరుతూ ఆ ప్రాంత ప్రజలు చేపట్టిన దీక్షలో ఇవాళ(గురువారం) గందరగోళం చోటుచేసుకుంది.
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ ఆ ప్రాంత ప్రజలు రెండు నెలలుగా ఉద్యమబాట పట్టారు. ఇలా మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో స్థానికులు చేపడుతున్న అమరావతి నిరసన దీక్షా శిబిరంలో గందరగోళం నెలకొంది. ఓ దుండగుడు ఆర్టీసి బస్సుల్లోంచి దీక్షా శిబిరంపై మందు బాటిల్ విసరడం ఈ అలజడికి కారణమయ్యింది.
విజయవాడ నుంచి సచివాలయం వైపు వెళ్తున్న సిటీ బస్సులో ప్రయాణిస్తూ శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి కృష్ణాయపాలెం దీక్షలో వున్నవారిపై మద్యం బాటిల్ విసిరాడు. దీంతో అక్కడే వున్న యువకులు బస్సును వెంబడించి అతన్ని పట్టుకున్నారు. అతన్ని స్థానిక పోలీసులకు అప్పగించారు.
undefined
read more 9 నెలల్లోనే తీవ్ర ప్రజా వ్యతిరేకత: జగన్‌పై దేవినేని ఫైర్
ఈ ఘటనతో కృష్ణాయపాలెం దీక్షా శిబిరం వద్ద కొద్దిసేపు గందరగోళం నెలకొంది. పట్టుబడిని ఆగంతకుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడని...ఆ పార్టీ స్థానిక నాయకుల ప్రోద్బలంతోనే ఇలా చేసి వుంటాడని రాజధాని ప్రజలు అనుమానిస్తున్నారు.
ఈ ఘటనలో పట్టుబడిన శ్రీనివాస్ రెడ్డి గుంటూరు జిల్లా ధరణికోటకు చెందిన వ్యక్తిగాపోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతన్ని విచారిస్తున్నట్లు... ఇలా ఎందుకు చేశాడన్న దాని గురించి సమాచారం సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.