ప్రధాని మోదీతో జగన్ భేటీ... ఆ రహస్య ఒప్పందాల కోసమేనా...: వర్ల రామయ్య

By Arun Kumar P  |  First Published Feb 12, 2020, 10:26 PM IST

''పుల్లయ్య ఎవ్వారం ఎలా ఉందంటే వెళ్ళారు వచ్చారు''లా ఉంది జగన్‌ ధిల్లీ పర్యటన అని వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా సాధిస్తానని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తే ప్రజలు క్షమించరని వర్ల హెచ్చరించారు. 


గుంటూరు: ఢిల్లీ పర్యటనలో ప్రధాన మంత్రి మోదీతో జరిగిన భేటీలో కుదుర్చుకున్న రహస్య ఒప్పందాలను బహిర్గతం చేయాలని సీఎం జగన్మోహన్‌రెడ్డిని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డిమాండ్‌ చేశారు. ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలసిన అంశాలపై సీఎం జగన్‌ స్పష్టమైన ప్రకటన చేయాలని కోరుతూ జగన్‌ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో బుధవారం వర్ల రామయ్య ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. 

''పుల్లయ్య ఎవ్వారం ఎలా ఉందంటే వెళ్ళారు వచ్చారు''లా ఉంది జగన్‌ ధిల్లీ పర్యటన అని వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. 25 ఎంపీలను గెలిపించండి కేంద్రం మెడలు వంచి ప్రత్యేకహోదా తెస్తానన్న హామీ ఎంత వరకూ సాధించారోనని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు.  ప్రత్యేక హోదా సాధిస్తానని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తే ప్రజలు క్షమించరని వర్ల హెచ్చరించారు. 

Latest Videos

read more  ప్రతిపక్ష నాయకుల ప్రాణాల తీసిన ఆ కత్తినే జగన్ ఇప్పుడు...: అనగాని సత్యప్రసాద్

ప్రధానితో సమావేశామంటే కనీసం ఎజెండా కూడా ప్రకించకపోవడంలో ఆంతర్యమేమిటో బయటపెట్టాలన్నారు. ఏపీకి విభజన హామీలు మాత్రమే కాదు... కేంద్ర విద్యా సంస్థలు, పోలవరం, రైల్వే జోన్‌ కు నిధుల కేటాయింపులో కేంద్రం అలసత్వాన్నీ నిగ్గుతీశావా అని ప్రశ్నించారు. సీబీఐ కేసుల మాఫీ, కోర్టుల్లో వ్యక్తిగత హాజరు మినహాయింపు, మండలి రద్దు, మూడు ముక్కలాటలా రాజధానుల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం పొందడానికే ధిల్లీ పర్యటన అన్న ప్రజల అనుమానాలను నివృత్తి చేయాలన్నారు. 

అధికారం ఇచ్చింది 5 కోట్ల ఆంధ్రుల హక్కులు, ప్రయోజనాలు కాపాడానికేగానీ వ్యక్తిగత లబ్ది కోసం కాదని గుర్తించాలన్నారు. ప్రత్యేక హోదా మినహా ఏం తెచ్చినా ప్రజలు హర్షించరని పేర్కొన్నారు.సీబీఐ కేసుల్లో  మినహాయింపు, వ్యక్తిగత పనులు చక్కబెట్టుకోడానికే ఢిల్లీ వెళ్లి ఉంటారని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారన్నారు. అకస్మాత్తుగా ధిల్లీ ప్రయాణం పెట్టుకుని బీజేపీ పెద్దలతో లాలూచి వ్యవహారాలూ నడుపుకోవడంపై ఆగ్రహం వెలిబుచ్చారు. 

సిబీఐ కేసుల మాఫీ కోసమా, ప్రజల ప్రయోజనాలు నెరవేర్చడం కోసమా బహిర్గతం చేయాలన్నారు. కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న కాపుల రిజర్వేషన్‌ ఫెయిల్‌పై ప్రధానితో మాట్లాడావా?'' రాష్ట్రానికి నిధుల కేయింపులు లేకపోవడంతో కేంద్ర బడ్జెట్పై రాష్ట్ర ప్రజలు అసంతృప్తితో ఉన్నారన్నారు. దిల్లీ వెళ్లి వట్టి చేతులతో తిరిగి రావడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని జగన్‌ గ్రహించాలన్నారు. 

read more  ఆ మూడు సిద్దాంతాలను ఫాలో అవుతున్న వైసిపి...: కళా వెంకట్రావు

వ్యక్తిగత ఎజెండా పక్కన బెట్టి ప్రజల పక్షాన కేంద్ర నిధుల కోసం పోరాడాల్సిన సమయంలో ప్రధాని భేటీని వృధా చేశారన్నారు. వెనుకబడిన జిల్లాలకు మూడేళ్లుగా సాయమేది? అని కేంద్రాన్ని నిలదీశావా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు. లోక్‌సభ వేదికగా ప్రత్యేక హోదా సాధనపై వైసీపీ ఎంపీలు విఫలమైన నేపధ్యంలో స్వయంగా ప్రధాని మోడీని అడిగి సాధించుకు రాకపోవడమేమిటన్నారు. 

వైసీపీ ఎంపీలు నిస్సిగ్గుగా లోక్‌సభకు హాజరావడం మినహా కేంద్రాన్ని అడగకుండా ముఖం చాటేస్తున్నారన్నారు.. ముఖ్యమంత్రి స్థాయిలో జగన్‌ అదే పనిని చేయడాన్ని ఏపీ ప్రజలు ఎవగిస్తున్నారన్నారు. రాజకీయ లబ్ధికి వెరవకుండా గత ఐదేళ్లలో హోదా సాధన కోసం పలు మార్గాల్లో టీడీపీ పోరాడిందని, నిర్భయంగా కేంద్రాన్ని నిలదీసి ప్రజల కోసం ఎంత త్యాగానికైనా వెనుకాడలేదని గుర్తు చేశారు. సిబీఐ  కేసుల మాఫీకి, కోర్టులో హాజరు మినహాయింపుకు 5 కోట్ల ఆంధ్రప్రదేశ్‌ ప్రజల హక్కులను, ఆకాంక్షలను తాకట్టు పెట్టవద్దని వర్ల రామయ్య మనవి చేశారు.

click me!