చిన్నారిపై ఆత్యాచారం... నిందితుడికి ప్రభుత్వ అండదండలు...: చంద్రబాబు

By Arun Kumar PFirst Published Oct 25, 2019, 9:04 PM IST
Highlights

గుంటూరులో చిన్నారి  పాపపై జరిగిన అత్యాచారంపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. నిందితుడికి కఠిన శిక్ష పడేవరకు టిడిపి తరపున పోరాడలతామని ప్రకటించారు.  

గుంటూరు జిల్లా: దాచేపల్లి మండలం పెద్దగార్లపాడు గ్రామంలో చిన్నారిపై అత్యాచార ఘటనను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. ముక్కుపచ్చలారని చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితుడిని కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం సిగ్గుచేటని అన్నారు. బాదిత కుటుంబానికి తెలుగు దేశం పార్టీ అండగా వుంటుందని ఆయన స్పష్టం చేశారు.

శుక్రవారం గుంటూరు జిల్లాకు చెందిన టిడిపి మైనార్టీ సెల్‌ నాయకుడు నూరుభాషా, గుంటూరు వన్‌ ఇన్‌చార్జ్‌ నసీర్‌ అహ్మద్‌ ఆధ్వర్యంలో కొందరు  ముస్లీం నాయకులు చంద్రబాబు నాయుడు ను కలిశారు. ఈ సందర్భంగా చిన్నారిపై జరిగిన అఘాయిత్యం, ఆ  తర్వాత చోటుచేసుకుంటున్న పరిణామాల గురించి ఆయనకు వివరించారు. కాబట్టి నిందితులపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆయనను కోరారు. 

read more  హాజీపూర్ హత్య కేసులో కీలక మలుపు: మరణశిక్ష..

ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ... సభ్య సమాజం తలదించుకునేలా ముక్కు పచ్చలారని చిన్నారిపై ఇటువంటి ఘటనలకు పాల్పడటం సిగ్గుచేటన్నారు. సంఘటన జరిగి వారం గడుస్తున్నా నిందితులను అరెస్ట్‌ చేయకుండా ప్రభుత్వం భాద్యతారాహిత్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. 

చిన్నారిపై జరిగిన ఈ ఘటనను నీరుగార్చేందుకు అధికార పార్టీ నేతలు ప్రయత్నాలు చేయడం అరాచకత్వమన్నారు. నిందితులపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం వారికి అండగా నిలబడటం హేయనీయమని అన్నారు. 

బాధిత కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుందన్నారు. నిందితులకు చట్టపరంగా శిక్షలు పడేంత వరకు తెలుగుదేశం పార్టీ పోరాడుతుందన్నారు. 

read more అమిత్ షాతో చంద్రబాబు ప్రేమాయణం...లవ్ లెటర్లు కూడా: పేర్ని నాని

ఈ సమావేశంలో గుంటూరు జిల్లా నూరుభాషా, దూదేకుల సంఘం అధ్యక్షులు మహ్మాద్‌ ఖాజావలి, ప్రధాన కార్యదర్శి ఖాజావలి, రాష్ట్ర దీన్‌ కమిటీ అధ్యక్షులు కాటన్‌ వలి, నగర యూత్‌ అధ్యక్షులు షేక్‌.బాజితో పాటు గుంటూరు టౌన్‌ ముస్లీం పెద్దలు పాల్గొన్నారు.

        
                                 
 

click me!