భువనగిరి: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హాజీపూర్ వరుస హత్యకేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. హాజీపూర్ వరుస హత్యల ఘటనపై భువనగిరి స్పెషల్ కోర్టు విచారణ ప్రారంభించింది. ఈనెల 14 నుంచి 18 వరకు స్పెషల్ కోర్టులో ట్రయల్స్ నడిచాయి.

డీఎన్ఏ రిపోర్టుతోపాటు, ఫోరెన్సిక్ రిపోర్టులను భువనగిరి స్పెషల్ కోర్టుకు పోలీసు అధికారులు సమర్పించారు. చార్జిషీట్ లో 300మంది సాక్షులను విచారించినట్లు స్పష్టం చేసింది. అలాగే హత్యకు గురైన బాలికల కుటుంబ సభ్యులు, సాక్షుల స్టేట్మెంట్లను కోర్టు రికార్డు చేసింది. 

మరో 45 రోజులపాటు హాజీపూర్ వరుస హత్యల ఘటనపై భువనగిరి స్పెషల్ కోర్టులో విచారణ జరగనుంది. మగ్గురు బాలికలను అత్యాచారం చేసి ఆ తర్వాత అత్యంత కృరంగా హత్య చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ముగ్గురు మైనర్ బాలికలను అత్యంత కిరాతకంగా రేప్ చేసి హత్య చేశాడు మానవ మృగం మర్రి శ్రీనివాస్ రెడ్డి. 

 2015 ఏప్రిల్ నెలలో మెుదటి హత్య చేశాడు శ్రీనివాస్ రెడ్డి. ఆ తర్వాత 2019 మార్చి, ఏప్రిల్ నెలలో మరో ఇద్దరు మైనర్ బాలికలను అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేశాడు మర్రి శ్రీనివాస్ రెడ్డి. 

మర్రి శ్రీనివాస్ రెడ్డి హత్య కేసుకు సంబంధించి టెక్నికల్స్ ఆధారాలతోపాటు డీఎన్ఏ, ఫోరెన్సిక్ ఆధారాలను సైతం పోలీసులు సంపాదించారు. మరో నాలుగు వారాలపాటు కోర్టులో విచారణ జరిగిన అనంతరం ఫైనల్ తీర్పు వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. 

ఇకపోతే నిందితుడు శ్రీనివాస్ రెడ్డికి మరణ శిక్ష పడేలా అన్ని సెక్షన్లు నమోదు చేశారు పోలీసులు. మనీషా, శ్రావణి, కల్పనలపై అత్యాచారం చేసి హత్య చేశాడని ఫోరెన్సిక్ నివేదిక ఇప్పటికే తేల్చిచెప్పడంతో ఆ రిపోర్టను కోర్టుకు సమర్పించారు. 

అలాగే శ్రీనివాస్ రెడ్డి సెల్ ఫోన్‌లో ఉన్న మెసేజ్‌లు, వీడియోలను కూడా సేకరించారు పోలీసులు. కోర్టులో నేరం నిరూపణ కావడానికి కావలసిన బలమైన సాక్ష్యాధారాలు అన్నిటినీ న్యాయస్థానానికి అందజేశారు. 

ఈ కేసులో కీలకమైన డీఎన్ఏ, రక్తపరీక్షలు, పోస్టుమార్టం రిపోర్టు, సంఘటనా స్థలంలో దొరికిన ఆధారాలను పోలీసులు కోర్టుకు సమర్పించారు పోలీసులు. ఇకపోతే బొమ్మలరామారం మండలం హాజీపూర్ కు చెందిన శ్రీనివాస్ రెడ్డి ఏసీ మెకానిక్ గా పనిచేసేవాడు. 

ఆ గ్రామానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో బైక్ పై లిఫ్ట్ ఇస్తూ అమాయకులైన యువతులపై అత్యాచారం చేసి అతికిరాతకంగా హత్య చేసేవాడు. శ్రావణి అనే పదోతరగతి బాలిక మిస్సింగ్ కేసులో శ్రీనివాస్ రెడ్డి దారుణాలు వెలుగులోకి వచ్చాయి. 

పోలీసుల కేసు విచారణలో మనీషా, శ్రావణి, కల్పనలను తానే అత్యాచారం చేసి హత్య చేసినట్లు  నిందితుడు శ్రీనివాస్ రెడ్డి పోలీసుల విచారణలో అంగీకరించాడు. నిందితుడు శ్రీనివాస్ రెడ్డికి మరణ శిక్ష విధించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. 

ఇకపోతే హాజీపూర్ యువతులపై అత్యాచారం చేసి హత్య చేసిన శ్రీనివాస్ పై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో అతడి ఇంటికి నిప్పు పెట్టి తగలబెట్టిన సంగతి తెలిసిందే.  

ఈ వార్తలు కూడా చదవండి

హాజీపూర్ సీరియల్ కిల్లర్: ఆ జంట మాయం వెనుక శ్రీనివాస్ రెడ్డి?

హాజీపూర్ హత్యల కేసు: శ్రీనివాస్ రెడ్డిని ఉరితియ్యాలంటూ శ్రావణి తల్లిదండ్రుల దీక్ష