దళిత ఎస్ఐను కులం పేరుతో దూషించారని ఆరోపించిన టీడీపీ నేత నన్నపనేని రాజకుమారిని అరెస్ట్ చేయాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
మంగళగిరి: టీడీపీ నేత, మాజీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నాడు వైఎస్ఆర్‌సీపీ, దళిత సంఘాలు మంగళగిరిలో ర్యాలీ నిర్వహించారు.
ఛలో ఆత్మకూరు కార్యక్రమం సందర్భంగా మహిళ ఎస్ఐ అనురాధతో నన్నపనేని రాజకుమారి దురుసుగా ప్రవర్తించారని వైఎస్ఆర్‌సీపీ ఆరోపిస్తోంది. దళిత ఎస్ఐ అనురాధపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కేసు కూడ నమోదైంది.
నన్నపనేని రాజకుమారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేయాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో ర్యాలీ నిర్వహించారు. దళిత ఎస్ఐను కించపర్చేలా మాట్లాడడం సరైంది కాదని ఎమ్మెల్యే ఆర్కే అభిప్రాయపడ్డారు. ఈ విషయమై చంద్రబాబు దళితులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
మరో వైపు నన్నపనేని రాజకుమారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నాడు డీజీపీ కలిసి వినతి పత్రం సమర్పించనున్నారు వైఎస్ఆర్‌సీపీ నేతలు. మహిళ కమిషన్ చైర్‌పర్సన్ గా పనిచేసిన నన్నపనేని రాజకుమారి ఈ రకమైన వ్యాఖ్యలు చేయడంపై దళిత సంఘాలు మండిపడుతున్నాయి.
సంబంధిత వార్తలు
చంద్రబాబు పిలుపు: నన్నపనేనిపై అట్రాసిటీ కేసు
నన్నపనేనిపై మహిళా ఎస్సై ఆగ్రహం: దళితుల వల్లే దరిద్రం అంటారా అంటూ ఫైర్
పోలీసుల అదుపులో నన్నపనేని రాజకుమారి