మాజీ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మెన్ నన్నపనేని రాజకుమారిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. చంద్రబాబు నివాసం వద్ద పోలీసులకు, టీడీపీ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది.
అమరావతి: తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎస్ఐ అనురాధ మాజీ ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారిపై ఆరోపణలు చేశారు. నన్నపనేని రాజకుమారిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.
చంద్రబాబునాయుడు నివాసం వద్ద పోలీసులకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకొంది. బాబు నివాసంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన నన్నపనేని రాజకుమారితో పాటు మరికొందరు టీడీపీ మహిళ నేతలను పోలీసులు అడ్డుకొన్నారు.
ఈ సమయంలో నన్నపనేని రాజకుమారి మహిళ ఎస్ఐ అనురాధపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆమె ఆరోపించారు. బాధ్యత రాహిత్యంగా నన్నపనేని రాజకుమారి మాట్లాడారని ఎస్ఐ అనురాధ చెప్పారు. ఇదే విషయమై టీడీపీ నేతలతో వాగ్వాదానికి దిగారు. నన్నపనేని రాజకుమారితో పాటు పలువురు టీడీపీ మహిళ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.
సంబంధిత వార్తలు
నన్నపనేనిపై మహిళా ఎస్సై ఆగ్రహం: దళితుల వల్లే దరిద్రం అంటారా అంటూ ఫైర్