చంద్రబాబుకు సంబంధించిన ఆ వీడియోలన్నీ మా దగ్గర ఉన్నాయి: శ్రీకాంత్‌ రెడ్డి

By Rekulapally Saichand  |  First Published Dec 15, 2019, 6:18 PM IST

వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయం  తాడేపల్లిలో ప్రభుత్వ ఛీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో చర్చకు వచ్చిన  పలు అంశాలను మీడియాకు వివరించారు.


వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయం  తాడేపల్లిలో ప్రభుత్వ ఛీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో చర్చకు వచ్చిన పలు అంశాలను మీడియాకు వివరించారు. మొదటి రోజు చర్చలో ప్రశ్నోత్తరాలలో పిపిఏలపై మెగా డిఎస్సి,ప్రత్యేక హోదాపై,మహిళల భధ్రత,కాల్‌ మనీ సెక్స్‌ రాకెట్‌ లపై కూడా చర్చ జరిగినట్లు తెలిపారు.

మహిళల భద్రత పై దిశ చట్టం తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ అంశంపై ప్రతిపక్షం చర్చికుండా దాన్ని  తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నంచేశారన్నారు. రెండోరోజు ఉల్లిధరలపై చర్చ చేపనట్లు తెలిపారు. ఈ చర్చలో గుడివాడలో ఓ వ్యక్తి మార్కెట్‌ కు వెళ్లి మృతి చెందితే దానిని ఉల్లిపాయలకోసం అంటూ రంగుపులిమే ప్రయత్నం చేశారన్నారు.మంత్రి కొడాలినాని బాధితుడు ఇంటికి వెళ్లి వాస్తవాలు విచారిస్తే ఉల్లిపాయల కోసం ఆయన వెళ్లలేదని అనారోగ్యం ల్ల అని కుటుంబసభ్యులే చెప్పారు.అయినా శవరాజకీయాలకు ప్రయత్నంచేశారని ప్రతిపక్షంపై విరుచుకుపడ్డారు.

Latest Videos

undefined

Also Read: మీకు ఎన్ని నిధులు కావాలో చెప్పండి తెప్పిస్తా...అంతేకానీ..

హాల్‌లో జరిగిన పలు అంశాలనుశ్రీకాంత్‌ రెడ్డి  వివరిస్తూ .. " రైతు భరోసా పధకం గురించి కూడా చర్చించాం. దానిపై చర్చించలేక సభలో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నం చేశారు టీడీపీ సభ్యులు . రైతుల కోసం శ్రీ వైయస్‌ జగన్‌ రైతుభరోసాను ముందే ప్రారంభించారు.మూడోరోజు కూడా 50 శాతం రిజర్వేషన్లు నామినేటేడ్‌ పోస్టులు,ఆర్టిసిలో బస్సులు కొనుగోలు,రాయలసీమ ప్రాజెక్టులపై కూడా చర్చల వస్తే సుధీర్ఘంగా చర్చిస్తే దానిపై కూడా వారు సరిగా చర్చకు రాలేకపోయారని" అన్నారు.

"ఏదైనా ఒక్క అంశంపై అన్నా సరైన రీతిలో స్పందించలేదు.రాయలసీమ నుంచి ఎన్నికైన బాలకృష్ణ,చంద్రబాబులు ఉన్నా ఆ ప్రాంత ప్రాజెక్టులపై చర్చించకుండా .చేతులెత్తేశారు.
 అదే రోజు ఇంగ్లీషు మీడియంపైన చర్చ జరిగింది.అన్నింటిని క్లియర్‌ గా ఎక్స్‌ ప్లేయిన్‌ చేశాం.గ్రామసచివాలయాలపై కూడా సలహాలు ఇస్తారేమోనని చూశాం.అది కూడా చేయలేకపోయారు. సభను గందరగోళపర్చాలనే ప్రయత్నాలు చేస్తూ పోయారు.సభలోకి ఊరేగింపుగా కార్యకర్తలతో వచ్చే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. 

Also Read: ఓర్వలేక ఇలా చేస్తున్నాడు.. ఆయన ఈ రాష్ట్రంలో పుట్టడం దురదృష్టకరం: విజయసాయి


"ఎల్లోమీడియాతో తప్పుపట్టించి  దుర్మార్గమైన రాతలు రాయించారు. మార్షల్స్‌ తో చంద్రబాబు ప్రవర్తించిన తీరు అందరూ చూశారు.అందులో తప్పుచేసినట్లు కనిపిస్తున్నా ఎదురుదాడి చేస్తున్నట్లు వీడియోలలో సైతం ఉంది.అయినా నేను అనలేదు అంటాడు.ముఖ్యమంత్రిగారిని ఉన్మాది అంటాడు.అధికారులను బాస్టర్డ్‌ అని అంటారు.తర్వాత నేను అనలేదంటాడు.వీడియోలో చూపించి తప్పు ఒప్పుకోవయ్యా,క్షమాపణ చెప్పేపరిస్దితి నీకు లేదు కనీసం ఉద్యోగుల మనోభావాలను గౌరవించాలన్నా, నేను చేయను అని ఏదేదో మాట్లాడతారు.సభను తప్పుదోవపట్టించాలనే« ధ్యేయంతో వ్యవహరించారని" అన్నారు.

click me!