మహిళలు, చిన్నారుల రక్షణ కోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన దిశ యాక్ట్ పై స్పందిస్తూ టిడిపి నాయకురాలు పంచుమర్తి అనురాధ ముఖ్యమంత్రి జగన్ కు ఓ బహిారంగ లేఖ రాశారు. ఇందులో జగన్ కు ఆమె పలు ప్రశ్నలు సందించారు.
అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా రక్షణకోసం దిశ యాక్ట్ తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ యాక్ట్ ద్వారా బాదిత మహిళలకు సత్వర న్యాయం చేయడమే కాదు నిందితులకు కఠిన శిక్షలు విధించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇలా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, వేధింపులను తగ్గించాలని ప్రభుత్వం బావిస్తోంది. అయితే ఈ యాక్ట్ కు సంబంధించి సీఎం జగన్ కు పలు ప్రశ్నలు సంధిస్తూ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు.
''అయ్యా, మీరు దిశ చట్టం తీసుకొచ్చారు. అది మాటల్లోనే గానీ చేతల్లో లేదు. ఇది అమలవుతుందనే నమ్మకం ఎవరికీ లేదు. మీరు చట్టాలు తెస్తున్న మీ నాయకులకు అవి చుట్టాలుగా మారుతున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు.
గత ఆరు నెలలుగా 12 వేలకు పైగా వరకట్న సంఘటనలు మానభంగాలు, వేధింపు కేసులు జరిగాయి. వీటిపై ఇంతవరకు ముఖ్యమంత్రిగా మీరు కనీసం ఒక్క సారైనా సమీక్ష నిర్వహించకపోవడం బాధాకరం.
ఇటీవల గుంటూరు జిల్లా, దాచేపల్లి మండలం పెద్దగార్లపూడి గ్రామంలో 6 సంవత్సరాల ఒక మైనార్టీ బాలికపై మీ ఎమ్మెల్యే కాసు మహేశ్వరరెడ్డి అనుచరుడు నరేంద్ర రెడ్డి అత్యాచారం చేస్తే ఇంత వరకు అతడిపై ఛార్జిషీటు నమోదు చేయలేదు గాని చట్టాలు చేశారంటే ఎలా నమ్ముతారు?
ఆడవారికి ఆస్తి హక్కు కల్పించింది, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించింది తెలుగుదేశం పార్టీ. గతంలో స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి, గెలవాటానికి అవకాశం ఉండేది కాదు. అటువంటిది తెలుగుదేశం పార్టీ ఆ అవకాశాన్ని కల్పించింది. ఒప్పుడు ఆడవారి చేతుల్లో ఒక రూపాయి ఉండేది కాదు, డ్వాక్రాను ఏర్పాటు చేసి, పొదుపు చేయడం నేర్పించి ఒక స్థాయికి తెచ్చింది తెలుగుదేశం పార్టీనే.
read more జాస్తి మాత్రమే కాదు వారుకూడా చంద్రబాబు మనుషులే...అందువల్లే: అంబటి
దాచేపల్లిలో ఒక మహిళపైన అత్యాచారం జరిగితే నిందితుడిని ఉరి తీసే దాక ఊరుకోనని చెప్పి చంద్రబాబునాయుడు చెప్పడంతో వారికి వారే ఉరేసుకొని చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. కాని నేడు మీ పాలనలో నేరం చేసిన వారిపట్ల గట్టిగా వార్నింగ్‌లు ఇచ్చిన సందర్బాలు లేవు.
కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఒక మహిళా అధికారి ఇంటికి మధ్యం సేవించి అర్ధరాత్రి వెళ్లి వారిని బెదించి నానా రభస చేస్తే అతనిపై కూడ చర్యలు తీసుకోలేదు. ఎంపీ గోరంట్ల మాధవ్ ఒక రేప్ కేసులో నిందితుడిగా ఉన్నా కూడా ఇంత వరకు చర్యలు తీసుకోలేదు. కనీసం సస్పెండ్ చేయలేదు, లేదా కేసు తిరిగదోడలేదు. మార్గాని భరత్ వరకట్న వేధింపు కేసులో ఉన్నాడు. అతనిపై చర్యలు తీసుకోలేదు సరి కదా బాధితురాలకి న్యాయం చేయకపోగా ఇంత వరకు ఆ విషయంలో ఎక్కడా మాట్లాడలేదు.
గత ఆరు నెలల్లో మీ అనాలోచిత చర్యలకు కృత్రిమ ఇసుక కొరత వల్ల దాదాపు 60 మంది మహిళలు తమ భర్తలను కోల్పోయి రోడ్డున పడ్డారు. కనీసం వాళ్లకు సానుభూతి కూడా తెలపలేదు. మీరు గానీ, మీ పార్టీవారుగానీ పరామర్శించిన దాఖలాలున్నాయా అంటే లేవనే చెప్పచ్చు.
read more జగన్ ప్రభుత్వ సంచలన నిర్ణయం... ఐఆర్ఎస్ అధికారి డిప్యుటేషన్ రద్దు
మీరు దిశ బిల్లుని శాసనసభలో ఆమోదించిన రోజే గుంటూరులో ఐదేళ్ల బాలికపై లక్ష్మణ్ రెడ్డి అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డారు. మీ పాలనలో మహిళలు బయటకు వెళ్ళాలంటే భయాందోళనలు చెందుతున్నారు. కొత్త చట్టం ప్రకారం మీరు నిందితుడికి 21 రోజుల్లోనే శిక్ష పడేలా చేసి బాధిత కుటుంబానికి న్యాయం చెయ్యడంతో పాటు, మహిళలకు భరోసా ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోంది'' అంటూ అనురాధ లేఖను ముగించారు.