చిలకలూరిపేట నియోజకవర్గంలోని అభివృద్ది పనులపై ఎమ్మెల్యే రజీని అధికారులతో కలిసి సమిక్ష నిర్వహించారు. పనులను త్వరగా పూర్తి
చేయలంటూ అధికారులకు సూచించారు.
చిలకలూరిపేట నియోజకవర్గంలోని అభివృద్ది పనులపై ఎమ్మెల్యే రజీని అధికారులతో కలిసి సమిక్ష నిర్వహించారు. పనులను త్వరగా పూర్తి చేయలంటూ అధికారులకు సూచించారు. " ఏడాదిలోగా వంద శాతం సీసీ రోడ్లు, కాలువల నిర్మాణం అభివృద్ధి పనుల కోసం నిధులకు ఢోకా లేదు మీరు చిత్తశుద్ధితో పనిచేయండి.. డబ్బులు తెచ్చే బాధ్యత నాది చిలకలూరిపేట నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే ధ్యేయం పని చేయాలని " అధికారులకు రజిని తెలిపారు.
నియోజకవర్గంలోని అన్ని మండలాల అధికారులతో సుదీర్ఘ సమావేశం నిర్వహించిన ఆమె చిలకలూరిపేట నియోజకవర్గంలో సీసీ రోడ్లు, కాలువల నిర్మాణం వంద శాతం పూర్తవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. తన కార్యాలయంలో ఆదివారం పమిక్షి నిర్వహించిన ఆమె నియోజకవర్గంలోని అన్ని మండలాల పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, ఎంపీడీవోలతో చర్చించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ " ఉపాధిహామీ పథకం నిధులు నియోజకవర్గానికి రూ.65 కోట్లు చొప్పున ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఈ నిధుల్లో రూ.15 కోట్లు సీసీ రోడ్ల నిర్మాణానికి, రూ.15 కోట్లు డ్రైన్ల నిర్మాణానికి వినియోగించాల్సి ఉంటుంది. ఒక్కో మండలానికి ఐదేసి కోట్ల రూపాయల చొప్పున వెంటనే అంచనాలు రూపొందించి తనకు అందజేయాలని వివరించారు. ఈ నిధులతో నియోజకవర్గంలో సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణాలు దాదాపు 40 శాతం వరకు పూర్తవుతాయని తెలిపారు. మిగిలిన 60 శాతం పనులు కూడా ఇదే ఏడాదిలో పూర్తవ్వాలని చెప్పారు.
చిలకలూరిపేట నియోజకవర్గానికి సంబంధించిన కోటి రూపాయల సీఎండీఎఫ్ నిధులను కూడా ఉపాధి హామీ నిధులతో అనుసంధానించాలని చెప్పారు. నియోజకవర్గానికి మరో రూ.5 కోట్లు మైనింగ్ నిధులు ఉన్నాయన్నారు. అన్ని గ్రామాల్లో కలిపి మరో రూ.40 లక్షల వరకు 14వ ఆర్థిక ప్రణాళికా సంఘం నిధులను కూడా అభివృద్ధి పనులకు వినియోగించుకునే అవకాశం ఉందని వెల్లడించారు. మొత్తం మీద రూ.2కోట్ల నిధులను ఉపాధి హామీ నిధులతో అనుసంధానించుకుని సిమెంటు రోడ్లు నిర్మించాలని అధికారులను ఆదేశించారు.
దీనివల్ల మరో 90 శాతం నిధులు అదనంగా వస్తాయని, అంటే రూ.20 కోట్ల నిధులు సీసీ రోడ్ల నిర్మాణానికి మనకు అందుబాటులో ఉంటాయని, దీనివల్ల వంద శాతం సీసీ రోడ్లు నిర్మాణం పూర్తవుతుందని, సంబంధిత అంచనాలు వెంటనే రూపొందించి అందజేయాలని అధికారులకు వివరించారు. 30ః 70 నిష్పత్తిలో ఉపాధి హామీ నిధులతో నియోజకవర్గానికి అందుబాటులో ఉన్న నిధులను అనుసంధానించి గ్రామాల్లో మురుగు కాలువల నిర్మాణం చేపట్టాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులకు సూచించారు
మూడు కోట్లను వినియోగిస్తే మరో 21 కోట్లు ప్రభుత్వం నుంచి వస్తాయని మొత్తం 24 కోట్ల నిధులతో కాలువల నిర్మాణం చేపట్టవచ్చని వివరించారు. అంచనాలు రూపొందించి ఇస్తే.. పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం నుంచి తాను మంజూరు చేయించుకొస్తానని వెల్లడించారు. ఈ లోగా ముందు గ్రామాల్లో పనులు ప్రారంభమయ్యేలా చూడాలని సూచించారు. వచ్చే జనవరి ఒకటో తేదీ కల్లా అన్ని గ్రామాల్లోనూ అభివృద్ధి పనులు ప్రారంభం కావాలని ఎమ్మెల్యే తెలిపారు. సమావేశంలో చిలకలూరిపేట, యడ్లపాడు, నాదెండ్ల మండలాల అభివృద్ధి అధికారులు పద్మాకర్, మాధురి, నాగేశ్వరరావు, పంచాయతీ రాజ్, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈలు, ఏఈలు, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ చిలకలూరిపేట, యడ్లపాడు, నాదెండ్ల మండలాల ముఖ్య నాయకులు దేవినేని శంకరరావు, చల్లా యజ్ఞేశ్వరరెడ్డి, డి.శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.