ఎయిడ్స్ వ్యాధిపై ఎన్నో మందుకు ,పరీక్షలు అందుబాటులోకి వచ్చాయని... కాబట్టి సమాజంలో ఎయిడ్స్ వ్యాధి సోకిన వాళ్ళని మనతో సమానంగా జీవించేలా చేసి మనోధైర్యం కల్పించాలని ఉపముఖ్యమంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ సూచించారు.
అమరావతి: ఎయిడ్స్ అవగాహనా ర్యాలీ లో విద్యార్థులు సహా అందరూ పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావడం సంతోషకరమని ఉపముఖ్యమంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ అన్నారు. హెచ్ఐవి సోకిందంటే ఆత్మహత్యలకు పాల్పడే రోజుల నుండి... ప్రజలే స్వయంగా అవగాహన పెంచుకునే స్థాయికి చేరుకున్నామన్నారు. అయితే మరింతగా ప్రజల్లో అవగాహన కల్పించడానికి డిసెంబర్ 1వ తేదీన అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు.
''ఎయిడ్స్ డే'' సందర్భంగా ఎపి రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణా సంస్థ నిర్వహించిన అవగాహన సభలో ఉపముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నాయని అన్నారు. బాధ్యత కలిగిన ప్రతి ఒక్కరు ఎయిడ్స్ పై అవగాహన కల్పించేందుకు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఎయిడ్స్ కు ఎన్నో ముందుకు ,పరీక్షలు అందుబాటులోకి వచ్చాయని...సమాజంలో ఎయిడ్స్ వ్యాధి సోకిన వాళ్ళని మనతో జీవించేలా చేసి మనోధైర్యం కల్పించాలన్నారు. ఈ వ్యాధికి సంబంధించిన మెడిసిన్స్ ఏఆర్టీ సెంటర్ లలో అందుబాటులో ఉన్నాయని.... వ్యాధి సోకిన వారు మందులు వాడేలా చైతన్య పరచాలని సూచించారు.
read more video:రేణిగుంట విమానాశ్రయంలో జనసేనానికి ఘన స్వాగతం
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తూ పేద ప్రజలకు వైద్యాన్ని అందుబాటులోకి తీసుకెళ్తున్నారన్నారు. ప్రజలందరికీ ఆరోగ్యం అనేది ఒక హక్కుగా ఉండాలనే ప్రాధాన్యతతో ప్రభుత్వం ముందుకు వెళుతోందన్నారు
ఎయిడ్స్ వ్యాధి సోకిన వారికి పెన్షన్ ఇస్తున్నామని...పెన్షన్ రాని వారికి కూడా వచ్చేలా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి అన్ని విధాలా వ్యాధిగ్రస్తులను ఆదుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు.
read more చంద్రబాబు వాహనంపై దాడి కేసు... సిట్ ఏర్పాటు
ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్భంగా కృష్ణా జిల్లాలో కూడా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహ ర్యాలీ నిర్వహించారు. విజయవాడ రైల్వే స్టేషన్ క్లాక్ టవర్ నుండి తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు అ ర్యాలీ కొనసాగింది. ఇందులో కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, జిల్లా వైద్య శాఖ అధికారులు, వివిద కాలేజ్ విద్యార్థులు పాల్గొన్నారు.
హెచ్ఐవి ఎయిడ్స్ పై జానపద కళాకారులు పాటలు, వీధి నాటకలను ప్రదర్శించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ...ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్భంగా ఈ ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు.
ప్రతిఒక్కరిలో ఎయిడ్స్ పై అవగాహన రావాలన్నారు. కృష్ణాజిల్లాలో 23 వేల మంది ఎయిడ్స్ బాధితులు ఉన్నారని... వారందరి కోసం జిల్లాలో నాలుగు ఏఆర్టీ సెంటర్ లు ఏర్పాటు చేసామన్నారు. ఎయిడ్స్ వ్యాధి నియంత్రణే లక్ష్యంగా అందరూ కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.