నవరత్నాలు కాదు ప్రజలకు నవరత్న తైలం రాసారు...: జగన్ ప్రభుత్వంపై లోకేశ్ ఫైర్

By Arun Kumar P  |  First Published Nov 30, 2019, 7:48 PM IST

ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ ప్రభుత్వ పాలన కొనసాగిన ఈ ఆరునెలలు రాష్ట్రం అధోగతి పాలయ్యిందని టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. 


అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ జగన్ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టి  ఆరునెలలు కావస్తోంది. ఈ కాలంలో తాము భారీఎత్తును పనులు చేపట్టినట్లు అధికార వైసిపి నాయకులు, మంత్రులు, అసలు ప్రభుత్వం ఏలాంటి పనులు చేయలేదని ప్రతిపక్ష టిడిపి నాయకులు మాటల యుద్దానికి దిగారు. ఈ క్రమంలో టిడిపి శనివారం ఉదయమే జగన్ ఆరు నెలల పాలనపై ఓ పుస్తకాన్ని విడుదల చేసింది. తాజాగా ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ కూడా వైసిపి పాలనపై ట్విట్టర్ వేదికన విరుచుకుపడ్డారు.  

''ఆరు నెలల్లో మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటా అన్న @ysjagan గారు రాష్ట్రాన్ని ముంచేసిన ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయారు. విధ్వంసంతో ప్రారంభం అయిన వైకాపా ఆరు నెలల పాలనలో ఆంధ్రప్రదేశ్ ని సూసైడ్ ప్రదేశ్ గా మార్చారు.''

Latest Videos

''ఎన్నికలకు ముందు నవరత్నాలు ఇస్తా అన్న జగన్ గారు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో మాట మార్చి ప్రజల నెత్తిన నవరత్న తైలం రాసారు'' అంటూ లోకేశ్ సెటైర్లు విసిరారు.

read more  ప్రియాంక రెడ్డిపై అత్యాచారం, హత్య... ఏపిలోనూ ఇదే పరిస్థితి..: పంచుమర్తి అనురాధ

''వైసీపీ పాలనలో తెలుగు తల్లికి, తెలుగు భాషకీ, తెలుగు సంస్కృతికీ... మొత్తంగా తెలుగుదనానికే  గడ్డురోజులొచ్చాయి. జాతీయ గీతాన్నే మర్చిపోయినోళ్ళకు ఒక జాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం ఏం చేతనవుతుంది? ''

''దేశంలో ఎవరైనా 'పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్నాం' అని అంటే వారిని @ncbn గారు ఏపీకి తీసుకెళ్ళి పోతారేమో అని మిగతా రాష్ట్రాలు భయపడేవి. ఇప్పుడు ఏపీ నుంచి వెళ్ళిపోయే కంపెనీలని సునాయాసంగా వాళ్ళ రాష్ట్రాలకు తీసుకెళ్ళిపోతున్నారు. అందుకేగా రివర్స్ పాలన అనేది. ''

''రత్నాలు వైకాపా నాయకులు మింగి రాళ్లు ప్రజల చేతిలో పెడుతున్నారు. ఎంత మంది రైతులు, కౌలు రైతులకు భరోసా ఇచ్చారో చెప్పలేని దుస్థితిలో జగన్ గారి ప్రభుత్వం ఉంది.''

''45 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్న హామీ ఎగిరిపోయింది. 3 వేల పెన్షన్ పోయింది. రైతు భరోసా 13,500 అని ఇప్పుడు 7,500 ఇస్తున్నారు. అమ్మ ఒడిని ఆంక్షల ఒడిగా మార్చారు.''

''సంక్షేమ కార్యక్రమాలకు రివర్స్ టెండర్ పెట్టిన ఘనుడు @ysjagan గారు. అన్న క్యాంటిన్లు, చంద్రన్న బీమాతో సహా ncbn గారి హయాంలో ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేసారు. ఆరు నెలల పాలనలో రత్నాలు అన్ని జారిపోయాయి.''

 ''వృద్దులకు నెలకు రూ.250, రైతులకు 625 రూపాయిలు ఇస్తున్న జగన్ గారు గ్రామ వాలంటీర్ల పేరుతో వైకాపా కార్యకర్తలకు నెలకు రూ.8 వేలు ఇస్తూ ఏడాదికి రూ.4 వేల కోట్ల ప్రజాధనాన్ని దోచేస్తున్నారు''

read more  జగన్ పాలనపై చెప్పుకోడానికేం లేదు...చెప్పు తీసుకుని కొట్టుకోడం తప్ప: అనురాధ

''ఆరు నెలల్లో అభివృద్ధి శూన్యం. సంక్షేమం సున్నా. పాదయాత్రలో ఇచ్చిన హామీలు ఒక మాయ. అధికారంలోకి వచ్చిన తరువాత @ysjagan గారు మహిళల్ని మోసం చెయ్యడం, రైతులను దగా చెయ్యడం, యువతని నిలువునా ముంచటం, పేదవాడి పొట్ట కొట్టటం మాత్రమే నిజం.''  అంటూ వైసిపి ప్రభుత్వాన్ని ఎండగడుతూ లోకేశ్ ట్వీట్ చేశారు.  

click me!