మంగళగిరి ఎమ్యెల్యే ఆళ్ళరామకృష్ణారెడ్డి ఇంటి ముందు యానిమేటర్లు ఆందోళన నిర్వహించారు. రావాలి ఆర్కే , సమాదానం చెప్పాలి ఆర్కే అంటూ ఇంటిముందు నిరసనకు దిగారు.
మంగళగిరి ఎమ్యెల్యే ఆళ్ళరామకృష్ణారెడ్డి ఇంటి ముందు యానిమేటర్లు ఆందోళన నిర్వహించారు. రావాలి ఆర్కే , సమాదానం చెప్పాలి ఆర్కే అంటూ ఇంటిముందు నిరసనకు దిగారు. వైసీపీ అధికారంలోకీ వచ్చిన తరువాత హామీలు అమలు చెయ్యకపోగా రాష్ట్రవ్యాప్తంగా 27 వేల మంది యానిమేటర్ల ఉద్యోగాలు ఊడగొట్టేందుకు సర్క్యులర్ జారీ చెయ్యటంపై వారు ఆగ్రహం వ్యక్తం .
రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (వెలుగు)లో పని చేస్తున్న డ్వాక్రా యానిమేటర్లను తొలగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం జారీ చేసిన యానిమేటర్ల తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. స్థానిక నాయకుల ఇంటి ముందు నిరసన తెలుపుతూ జీవో వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులతో వివిధ జిల్లాలో ఉన్న యానిమేటర్లను అధికారలు విధుల నుంచి తప్పిస్తున్నారు. దీంతో వారు సిబ్బందిలో కలవరం మెుదలైంది.
పొంచివున్న బుల్ బుల్ తుఫాను
దీంతో ప్రభుత్వ కార్యలయాల ఎదుట బైఠాయించి తమను విధుల్లోకి తీసుకునేలా చూడాలని కోరారు. సీఎం జగన్ ప్రజాసంకల్ప పాదయాత్రలో నెలకు రూ.10 వేల వేతనం చెల్లిస్తామని హామీ ఇచ్చారని, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత విధుల నుంచి తప్పించటంపై యానిమేటర్లు ప్రభుత్వాన్ని ప్రశ్నస్తున్నారు. తమను విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నారు.